దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ చమురు సంస్థ IndianOil (IOCL) వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇంధన విక్రయాలకే పరిమితం కాకుండా నాన్ ఫ్యూయల్(ఇంధనేతర) రాబడిని పెంచుకోవడంలో భాగంగా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను(బాటిల్ వాటర్) మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న 43000కు పైగా పెట్రోల్ బంకుల నెట్‌వర్క్ ద్వారా ఈ తాగునీటి బాటిళ్లను అందుబాటులోకి తేవాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ ఆయిల్ మల్టీ-ఇయర్ అగ్రిగేటర్ రాబడి భాగస్వామ్య నమూనాను ప్రతిపాదిస్తోంది.
డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ పై పూర్తి యాజమాన్యం, ప్రైసింగ్ నియంత్రణ ఇండియన్ ఆయిల్ వద్దే ఉంటుంది. ఎంపిక చేసిన అగ్రిగేటర్లు ప్లాంట్ల తయారీ, క్వాలిటీ అస్యూరెన్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, డెలివరీ బాధ్యతలను నిర్వహిస్తారు. అర్హత కలిగిన సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను కంపెనీ ఆహ్వానించింది.
విడతల వారీగా దేశవ్యాప్తంగా ఉన్న 43,603 పెట్రోల్ బంకులకు ఈ సేవలను విస్తరిస్తారు.ప్రయాణికుల్లో తాగునీటి అవసరం ఎక్కువగా ఉండే 21,435 హైవే బంకుల్లో ప్రాథమికంగా ఈ బాటిళ్లను అందుబాటులోకి తెస్తారు. ప్రారంభంలో 250 మి.లీ, 500 మి.లీ, 1 లీటర్ PET(Polyethylene Terephthalate) బాటిళ్లను విక్రయిస్తారు. వీటిలో 1 లీటర్ ప్యాక్‌ను ప్రధాన ఉత్పత్తిగా ప్రమోట్ చేయనున్నారు.
రాబోయే రోజుల్లో ప్రీమియం వాటర్, న్యాచురల్ మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఫంక్షనల్ హైడ్రేషన్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఇండియన్ ఆయిల్. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ ఇంధనేతర విభాగం ద్వారా వచ్చే రాబడిని రూ. 200 కోట్ల నుంచి రూ. 760 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రూ. 11,000 కోట్లకు పైగా గ్రాస్ మెర్చండైజ్ వాల్యూ సాధించాలని భావిస్తోంది.
కంపెనీ ఛైర్మన్ ఎ.ఎస్. సహనీ మాట్లాడుతూ.. వేగవంతమైన మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామిక పురోగతి నేపథ్యంలో బిటుమెన్, ఏవియేషన్ ఫ్యూయల్, లుబ్రికెంట్లు, నాన్-ఫ్యూయల్ రిటైల్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
{{/usCountry}}కంపెనీ ఛైర్మన్ ఎ.ఎస్. సహనీ మాట్లాడుతూ.. వేగవంతమైన మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామిక పురోగతి నేపథ్యంలో బిటుమెన్, ఏవియేషన్ ఫ్యూయల్, లుబ్రికెంట్లు, నాన్-ఫ్యూయల్ రిటైల్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
{{/usCountry}}ఇండియన్ ఆయిల్ బంకులకు రోజువారీగా సుమారు 3.2 కోట్ల మంది కస్టమర్లు వస్తుంటారు. నాన్-ఫ్యూయల్ బిజినెస్ కోసం ఇప్పటికే హిందూస్థాన్ యూనిలీవర్, డాబర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెర్న్స్ అండ్ పెటల్స్, ఎంటీఆర్ ఫుడ్స్, పీవీఆర్ సినిమాస్ వంటి ప్రముఖ బ్రాండ్లతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రస్తుతానికి ఈ పథకాన్ని కేవలం కంపెనీ సొంత అవుట్‌లెట్లు, డీలర్ అవుట్‌లెట్లు, కిసాన్ సేవా కేంద్రాలతో సహా పెట్రోల్ పంపుల వరకే పరిమితం చేశారు. ఎల్‌పీజీ ఏజెన్సీలు, ఆఫీసులు లేదా ఓపెన్ మార్కెట్ సేల్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు.
India Brand Equity Foundation (IBEF) నివేదికల ప్రకారం, భారతదేశ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్ విలువ 2025 నాటికి రూ. 32,040 కోట్లకు చేరింది. ఇది 2032 నాటికి ఏకంగా రూ. 57,850 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ భారీ మార్కెట్ వాటాలో మెజారిటీ షేరును దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియన్ ఆయిల్ అడుగులు వేస్తోంది.