...
...
Next Story

UPI : దుబాయ్ వెళుతున్నారా? ఇక యూపీఐ ద్వారా బుర్జ్ ఖలీఫా టికెట్లు కొనొచ్చు!

విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. దుబాయ్‌లోని ప్రసిద్ధ బుర్జ్ ఖలీఫాతో పాటు సింగపూర్‌లోని యూనివర్సల్ స్టూడియోస్, ఓషియేరియం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌కు మన మన భారత్ డిజిటల్ యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Published on: Nov 2, 2026, 14:02:41 IST
Advertisement

ప్రపంచవ్యాప్తంగా భారత డిజిటల్ విప్లవం సరికొత్త శిఖరాలను తాకుతోంది. మన దేశంలో కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తృతంగా వాడే 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (యూపీఐ) ఇప్పుడు అంతర్జాతీయంగానూ తన హవా కొనసాగిస్తోంది! విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయ పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రకటన చేసింది. దుబాయ్, సింగపూర్‌లలోని అత్యంత ప్రజాదరణ పొందిన వినోద, పర్యాటక ప్రాంతాల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ కోసం మన యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

యూపీఐ ద్వారా విదేశీ పర్యటనల పేమెంట్స్! (AI-generated image)
యూపీఐ ద్వారా విదేశీ పర్యటనల పేమెంట్స్! (AI-generated image)

దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాతో పాటు సింగపూర్‌లోని రిసార్ట్స్ వరల్డ్ సెంట్ నివాసంలో ఉన్న యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్, సింగపూర్ ఓషియేరియం, అడ్వెంచర్ కోవ్ వాటర్‌పార్క్‌ల టికెట్లను ఇకపై భారతీయులు తమ రోజువారీ యూపీఐ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు!

ఎన్పీసీఐ ఐఐపీఎల్ అంతర్జాతీయ భాగస్వామ్యాలు..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన 'ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్' (ఎన్​ఐపీఎల్) చేపట్టిన ఒప్పందాల ద్వారా ఈ చెల్లింపుల ప్రక్రియ అమల్లోకి వచ్చింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ): యూఏఈలో నియోపే, ఎమార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో బుర్జ్ ఖలీఫా ఈ-కామర్స్ (ఆన్‌లైన్) టికెటింగ్ కోసం యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. యూఏఈలో యూపీఐ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్‌ను అనుమతించిన తొలి పర్యాటక ప్రాంతంగా బుర్జ్ ఖలీఫా రికార్డు సృష్టించింది.

సింగపూర్: సింగపూర్‌లోని ప్రముఖ రిసార్ట్స్ వరల్డ్ సెంటోసాతో పాటు ఫొమో పే సంస్థతో కలిసి ఎన్పీసీఐ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రిసార్ట్స్‌లోని ప్రధాన వినోద ప్రదేశాలకు భారతీయులు నేరుగా యూపీఐలో చెల్లించవచ్చు.

భారత పర్యాటకులు విదేశాల్లో సురక్షితంగా, సులభంగా డిజిటల్ చెల్లింపులు జరిపేలా కేంద్ర ప్రభుత్వం ఈ నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది. కేవలం సింగపూర్‌కే భారత్ నుంచి గతేడాది 12 లక్షల మందికి పైగా పర్యాటకులు వెళ్లడం గమనార్హం. గతంలో 2024 జనవరి 26న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఈఫిల్ టవర్ టికెట్ బుకింగ్స్‌కు యూపీఐని అనుసంధానించారు.

ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్ అనే 10 దేశాలలో మన భారతీయ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఉజ్బెకిస్తాన్ 11వ దేశంగా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేరనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks