...
...
Next Story

IndiGo flight : దిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్- తప్పిన పెను ప్రమాదం!

IndiGo flight : పెను ప్రమాదం తప్పింది! విశాఖపట్నం నుంచి వెళ్లిన ఇండిగో విమానం దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. గాలిలో ఉండగానే ఒక ఇంజిన్ విఫలం ఇందుకు కారణం.

Published on: Mar 28, 2026, 12:58:15 IST
Advertisement

విశాఖపట్నం నుంచి దిల్లీకి 160 మంది ప్రయాణికులతో వెళుతున్న ఇండిగో విమానం శనివారం ఉదయం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాలిలో ఉండగానే ఒక ఇంజిన్ విఫలం కావడంతో పైలట్లు అప్రమత్తమై విమానాశ్రయ అధికారుల నుంచి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.

క్షేమంగా ల్యాండ్ అయిన విమానం..

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. (REUTERS)
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. (REUTERS)

సుమారు 161 మంది ప్రయాణికులతో ఉన్న ఈ బోయింగ్ 737 విమానం, ఉదయం 10:54 గంటలకు సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ విమానయాన సంస్థ, దిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ టీమ్ సురక్షితంగా కిందకు దించి తగిన ఏర్పాట్లు చేశాయి.

ఎయిర్‌లైన్స్ వివరణ..

ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధి స్పందిస్తూ.. విమానం ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించామని, వెంటనే ప్రాధాన్యత ప్రాతిపదికన ల్యాండింగ్ చేయాలని పైలట్లు కోరారని తెలిపారు.

“ముందస్తు జాగ్రత్త చర్యగా, ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్​ఓపీ) ప్రకారం, పైలట్లు ప్రయారిటీ ల్యాండింగ్ కోరారు. విమానం దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది,” అని ప్రతినిధి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, సంబంధిత అధికారులకు సమాచారం అందించామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.

వరుస విమాన ప్రమాద ఘటనలు..

ఇటీవల కాలంలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు వరుసగా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి:

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఈ నెల మొదట్లో హైదరాబాద్ నుంచి ఫుకెట్ వెళ్లిన విమానం హార్డ్ ల్యాండింగ్ కారణంగా తన నోస్ వీల్స్ (ముందు చక్రాలు) కోల్పోయింది. దీనివల్ల ఫుకెట్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు విమాన ప్రయాణికుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

This story has been published from a wire agency feed without modifications to the text. Only the headline has been changed.
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks