విమాన ప్రయాణికులకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తీపి కబురు అందించింది. లగేజీ లేకుండా కేవలం హ్యాండ్ బ్యాగుతో (కేబిన్ బ్యాగేజీ) ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం 'ఇండిగో లైట్' (IndiGo Lite) పేరిట సరికొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చడంతో పాటు, సేవలను విడివిడిగా అందించి టికెట్ ధరలను తగ్గించే వ్యూహంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
జూలై 1 నుంచి ఈ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 15 నుంచి ఈ టికెట్ల ద్వారా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ రూట్లలోనూ ఈ 'ఇండిగో లైట్' టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఇండిగో అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
రూల్స్ ఏంటి? ఆఫర్లు ఏమున్నాయి?
ఈ సరికొత్త ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు బేస్ ప్రైస్ (టికెట్ అసలు ధర) చాలా తక్కువగా ఉంటుంది. ఎలాంటి అదనపు రుసుము లేకుండానే ఆటో-అసైన్డ్ సీటు కేటాయిస్తారు. ప్రయాణికులు తమతో పాటు కేవలం 7 కేజీల వరకు కేబిన్ బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
"తక్కువ లగేజీతో ప్రయాణిస్తూ, తాము కోరుకున్న సేవలకే డబ్బులు చెల్లించాలనుకునే వారి కోసం 'ఇండిగో లైట్'ను రూపొందించాం. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కస్టమర్లకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం, చౌకగా మార్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం" అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆలోక్ సింగ్ తెలిపారు.
పెరుగుతున్న పోటీ.. రంగంలోకి ఎయిర్ ఇండియా
ఎయిర్‌లైన్స్ రంగంలో పోటీ పెరగడంతో విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇండిగోకు గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్ ఇండియా సైతం గత నెలలోనే 'బేసిక్ ఎకానమీ' పేరిట ఉచిత భోజనం లేని తక్కువ ధరల టికెట్లను ప్రవేశపెట్టింది. కేవలం ప్రయాణ ఖర్చులను మాత్రమే తగ్గించుకోవాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}ఎయిర్‌లైన్స్ రంగంలో పోటీ పెరగడంతో విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇండిగోకు గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్ ఇండియా సైతం గత నెలలోనే 'బేసిక్ ఎకానమీ' పేరిట ఉచిత భోజనం లేని తక్కువ ధరల టికెట్లను ప్రవేశపెట్టింది. కేవలం ప్రయాణ ఖర్చులను మాత్రమే తగ్గించుకోవాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
{{/usCountry}}మరోవైపు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తన డైరెక్ట్ ఛానల్స్ ద్వారా ఇప్పటికే ఇలాంటి బ్యాగేజీ-రహిత తక్కువ ధరల విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నేతృత్వంలోని ఇండిగో సైతం తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు 'ఇండిగో లైట్' ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.