వాషింగ్టన్: అమెరికాలో స్థానిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకొస్తున్న వరుస ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అత్యధిక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించిన హెచ్-1బీ వీసా వ్యవస్థలో రుసుములు పెంచడం, ఎంపిక ప్రక్రియను కఠినతరం చేయడంతో భారత దిగ్గజ కంపెనీలు తమ నియామకాల వ్యూహాన్ని మార్చుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 2027 హెచ్-1బీ లాటరీ నమోదుల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల దరఖాస్తుల సంఖ్య దారుణంగా క్షీణించిందని కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) నివేదిక వెల్లడించింది.
దిగ్గజ కంపెనీల్లో తీవ్రంగా పడిపోయిన నమోదులు

అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవలు (యూఎస్ సీఐఎస్) సాంకేతిక విభాగం వెల్లడించిన డేటా ప్రకారం.. ప్రముఖ అవుట్‌సోర్సింగ్ కంపెనీ కాగ్నిజెంట్ గత ఏడాదితో పోలిస్తే 100 శాతం దరఖాస్తులకు కోత విధించి, ఈసారి ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఇన్ఫోసిస్ హెచ్-1బీ నమోదులు 91 శాతం పడిపోగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దరఖాస్తులు 95 శాతం క్షీణించాయి.
అంకెల్లో చూస్తే ఈ వ్యత్యాసం స్పష్టమవుతోంది. ఇన్ఫోసిస్ దరఖాస్తులు ఆర్థిక సంవత్సరం 2026లో 8,886 ఉండగా, ఆర్థిక సంవత్సరం 2027 నాటికి 759కి పడిపోయాయి. టీసీఎస్ నమోదులు 5,955 నుంచి కేవలం 284కి తగ్గిపోయాయి. కాగ్నిజెంట్ 3,752 నుంచి నేరుగా 'సున్నా'కి చేరింది. సెప్టెంబరు 23, 2026 నాటి ఫెడరల్ రిజిస్టర్ ప్రచురణ సైతం ఇదే అంశాన్ని ధ్రువీకరించింది. ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలన్నీ కలిపి హెచ్-1బీ లాటరీ నమోదులను గతంలో ఉన్న 24,946 నుంచి 2,055కి తగ్గించుకున్నాయి. ఇది దాదాపు 92 శాతం తగ్గుదల.
అయితే, ఈ గణాంకాలు కేవలం వార్షిక హెచ్-1బీ క్యాప్ లాటరీ కోసం సమర్పించిన కొత్త దరఖాస్తులకు మాత్రమే సంబంధించినవి. ఆయా కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న మొత్తం హెచ్-1బీ ఉద్యోగుల సంఖ్యను ఇది ప్రతిబింబించదని, ప్రస్తుత వీసాదారుల హోదాకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టమైంది.
అధిక రుసుములు, కొత్త నిబంధనల ప్రభావం
వీసా అక్రమాలను అరికట్టడం, ఎక్కువ వేతనాలు పొందే నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం నిబంధనలను సవరించింది. ఫిబ్రవరి 2026 నుంచి 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అధిక వేతనం, ఎక్కువ నైపుణ్యం ఉన్న దరఖాస్తుదారులకే ఇందులో ప్రాధాన్యం దక్కుతుంది.
{{/usCountry}}వీసా అక్రమాలను అరికట్టడం, ఎక్కువ వేతనాలు పొందే నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం నిబంధనలను సవరించింది. ఫిబ్రవరి 2026 నుంచి 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అధిక వేతనం, ఎక్కువ నైపుణ్యం ఉన్న దరఖాస్తుదారులకే ఇందులో ప్రాధాన్యం దక్కుతుంది.
{{/usCountry}}విదేశాల నుంచి వచ్చేవారి కోసం సెప్టెంబరు 2025లో లక్ష డాలర్ల ($100,000) ప్రత్యేక చెల్లింపు నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ రుసుము అమల్లోకి వచ్చిన తొలి ఎనిమిది నెలల్లోనే క్యాప్-ఎగ్జెంప్ట్ యజమానుల కాన్సులర్ పిటిషన్లు గత ఏడాదితో పోలిస్తే 91 శాతం పడిపోయాయి. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆగస్టు 2026లో హెచ్-1బీ పిటిషన్లపై మరొక $103,265 అదనపు రుసుమును ప్రతిపాదించింది. ఇది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. వీటితో పాటు మార్చి 2026లో కార్మిక శాఖ ప్రామాణిక వేతన నిబంధనలను (Prevailing Wage) పెంచాలని ప్రతిపాదించడంతో మొదటి ఏడాదే కంపెనీలపై దాదాపు 1.46 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతుందని సీఆర్ఎస్ అంచనా వేసింది.
భారత ఐటీ ఉద్యోగులపై పడే ప్రభావమిదే..
పెరిగిన వ్యయాలు, కఠిన నిబంధనల నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు తమ అమెరికా ప్రాజెక్టుల నిర్వహణ శైలిని మార్చుకుంటున్నాయి. భారత్ నుంచి కొత్తగా ఉద్యోగులను తీసుకెళ్లడం కంటే, ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయులను నియమించుకోవడం, వీసా పొడిగింపులు (Extensions), బదిలీలు (Transfers), స్థానిక అమెరికన్ల నియామకంపై దృష్టి సారిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్లు తగ్గడం అనేది ఉద్యోగాలు కోల్పోవడానికి నేరుగా సంకేతం కానప్పటికీ, వ్యయాలు పెరగడం, మారిన లాటరీ విధానాల కారణంగా అమెరికాకు వెళ్లే కొత్త నియామకాల నమోదు గణనీయంగా తగ్గిందని తెలుస్తోంది.