సోషల్ మీడియా ప్రియులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కీలక మార్పును ఇన్స్టాగ్రామ్ ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది! 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే ఫొటోలు, వీడియోల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో 2016లోనే 'స్టోరీస్' ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మెటా ఆధారిత సంస్థ,. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత, ఇప్పుడు ఆ స్టోరీలను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది. స్టోరీ షేర్ చేసిన తర్వాత చిన్న అక్షర దోషం కనిపించినా, పాట మార్చాలనిపించినా ఇకపై దాన్ని డిలీట్ చేసి మళ్లీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలకు ఎలాంటి నష్టం కలగకుండానే 15 నిమిషాల లోపు స్టోరీని ఎడిట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనే కాకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలో ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సినిమా ప్రమోషన్ల నుంచి స్థానిక బొటిక్ వ్యాపారాలు, ఫుడ్ బ్లాగర్ల వరకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ అప్డేట్స్ కోసం స్టోరీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక్కసారి స్టోరీ పెట్టాక అందులో ఏదైనా తప్పు దొర్లితే, దాన్ని డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయడం వల్ల అప్పటికే వచ్చిన రీచ్, ఎంగేజ్మెంట్ దెబ్బతినేది. ఇన్స్టాగ్రామ్ తాజా అప్డేట్ కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా మేనేజర్లకు పెద్ద ఊరటనిస్తోంది.
15 నిమిషాల గడువు.. వ్యూస్, రిప్లైలకు ఏం కాదు!
స్టోరీ పోస్ట్ చేసిన 15 నిమిషాల వరకు యూజర్లు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. స్టోరీని షేర్ చేసిన తర్వాత అందులోని టెక్ట్స్, మ్యూజిక్, స్టిక్కర్లు, డ్రాయింగ్స్ వంటి వాటిలో మార్పులు చేసుకోవచ్చు అని అన్నారు. ఇలా మార్పులు చేసినప్పటికీ ఆ పోస్ట్‌కు అప్పటికే వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.
చిన్నపాటి స్పెల్లింగ్ తప్పులు లేదా చివరి నిమిషంలో చేయాల్సిన సవరణల కోసం స్టోరీని తొలగించి తిరిగి అప్లోడ్ చేసే తలనొప్పిని ఈ కొత్త ఆప్షన్ పూర్తిగా తప్పిస్తుంది. అయితే పారదర్శకత కోసం మార్పులు చేసిన స్టోరీలపై ‘Edited’ అనే లేబుల్ కనిపిస్తుంది. తద్వారా పోస్ట్ చేసిన తర్వాత దాన్ని సవరించారని వీక్షకులు సులభంగా గుర్తించగలరు.
స్టోరీని ఎడిట్ చేయడం ఎలా?
{{/usCountry}}చిన్నపాటి స్పెల్లింగ్ తప్పులు లేదా చివరి నిమిషంలో చేయాల్సిన సవరణల కోసం స్టోరీని తొలగించి తిరిగి అప్లోడ్ చేసే తలనొప్పిని ఈ కొత్త ఆప్షన్ పూర్తిగా తప్పిస్తుంది. అయితే పారదర్శకత కోసం మార్పులు చేసిన స్టోరీలపై ‘Edited’ అనే లేబుల్ కనిపిస్తుంది. తద్వారా పోస్ట్ చేసిన తర్వాత దాన్ని సవరించారని వీక్షకులు సులభంగా గుర్తించగలరు.
స్టోరీని ఎడిట్ చేయడం ఎలా?
{{/usCountry}}యూజర్లు తమ స్టోరీని ఎడిట్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా మీరు పోస్ట్ చేసిన స్టోరీని తెరిచి, కుడివైపు కింది మూలలో కనిపించే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే 'Edit Story' ఆప్షన్‌ను ఎంచుకుని కావాల్సిన మార్పులు చేసి సేవ్ చేస్తే సరిపోతుంది.
ఎడిటింగ్ సదుపాయంతో పాటు స్టోరీస్ క్రియేషన్ ఇంటర్ఫేస్ను కూడా ఇన్స్టాగ్రామ్ ఆకర్షణీయంగా అప్డేట్ చేసింది. కొత్త ఫాంట్లు, రంగులతో కూడిన సరికొత్త స్టిక్కర్ ఆప్షన్లను ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది. ఫోటోలకు మరింత అందాన్ని తెచ్చేందుకు కొత్త బ్లర్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లను జతచేసింది. దీనికి తోడు ఒకేసారి ఎక్కువ ఫోటోలను సులభంగా ఎంచుకుని షేర్ చేసే విధంగా యాప్‌ను తీర్చిదిద్దింది.
క్రియేటర్ల కాపీరైట్ రక్షణకు కొత్త టూల్.. టీనేజర్ల భద్రతపై ఏఐ నిఘా!
ఈ నెల ప్రారంభంలోనే ఇన్స్టాగ్రామ్ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఒరిజినల్ కంటెంట్ రూపొందించే క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా 'కంటెంట్ ప్రొటెక్షన్ టూల్' తీసుకొచ్చింది. ఒక క్రియేటర్ రూపొందించిన అసలు వీడియోలను ఇతరులు కాపీ కొట్టి తిరిగి అప్లోడ్ చేస్తున్నారా లేదా అన్నది ఈ టూల్ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు ప్లాట్‌ఫామ్‌లను స్కాన్ చేసి, అలాంటి పోలిన వీడియోలు కనిపించగానే అసలు క్రియేటర్‌కు వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది.
అలాగే టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వయసు అంచనా వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తప్పుడు వయసు వివరాలు ఇచ్చి ఖాతాలు నడుపుతున్న టీనేజ్ అకౌంట్లను ఈ ఏఐ వ్యవస్థ గుర్తించి తగిన భద్రతా నిబంధనలను వర్తింపజేస్తుంది. వరుస అప్డేట్లతో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు క్రియేటర్ల హక్కులకు ఇన్స్టాగ్రామ్ మరింత భరోసా కల్పిస్తోంది.