Hyundai Exter : 2026 హ్యుందాయ్ ఎక్స్​టర్​ బేస్​ వేరియంట్ కొనాలా? వద్దా?​ ఫీచర్లు, ధర ఇలా..

2026 ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఈ మోడల్​ని మీరు కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇది మీకోసమే. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ బేస్​ వేరియంట్​ ఫీచర్లు, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 24, 2026, 16:00:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని బేస్ వేరియంట్​ పేరు హెచ్​ఎక్స్​2. ఈ వేరియంట్ ఆడంబరాల కంటే భద్రత, కనీస అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇది 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో స్టాండర్డ్ పెట్రోల్, బై-ఫ్యూయల్ సీఎన్జీ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉండటం విశేషం. ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎక్స్​టర్​ బేస్​ వేరియంట్​ ఫీచర్లు, ధర వంటి వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​
2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్​

2026 హ్యుందాయ్​ ఎక్సటర్​- భద్రతకే అగ్రపీఠం..

అత్యంత చౌకైన వేరియంట్ అయినప్పటికీ, ఎక్స్​టర్​ హెచ్​ఎక్స్​2 భద్రతా పరంగా అద్భుతంగా సన్నద్ధమైంది.

6 ఎయిర్‌బ్యాగులు: డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్ రక్షణను కల్పిస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో స్టాండర్డ్‌గా వస్తాయి.

కంట్రోల్ సిస్టమ్స్: దీనితో పాటు హ్యుందాయ్ ఇందులో ఏబీఎస్​ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్​ఏసీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్​ఎం) వంటి ఫీచర్లను చేర్చింది.

నివారణ చర్యలు: హెచ్​ఎక్స్​2లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్లు, 3-పాయింట్ సీట్ బెల్టులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు వంటి నివారణ భద్రతా చర్యలు ఉన్నాయి.

అదనపు సెక్యూరిటీ: స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్-సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, ఇంజిన్ ఇమ్మోబిలైజర్, థెఫ్ట్​ అలారం వంటి ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి.

2026 హ్యుందాయ్​ ఎక్స్​టర్-​ ఎక్స్‌టీరియర్: సాధారణం, ఫంక్షనల్..

కొత్త హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ హెచ్​ఎక్స్​2 వేరియంట్ వెలుపలి డిజైన్ చాలా మినిమలిస్టిక్‌గా ఉంటుంది.

ఇందులో ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, రూఫ్ రైల్స్ లేదా అలాయ్ వీల్స్ ఉండవు.

ఇది స్టీల్ వీల్స్‌తో వస్తుంది. అలాగే ఓఆర్​వీఎంలు (సైడ్ మిర్రర్స్) పై ఎల్​ఈడీ టర్న్ ఇండికేటర్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి ఉండవు.

అయితే, ఎల్​ఈడీ టెయిల్ లాంప్స్ ఇవ్వడం విశేషం. బేస్ ట్రిమ్‌లో ఈ ఫీచర్ ఉండటం ఒక ముఖ్యమైన అంశం.

2026 హ్యుందాయ్​ ఎక్సటర్​- ఇంటీరియర్: బేసిక్ కానీ ఆచరణాత్మకం..!

లోపలి భాగం విషయానికి వస్తే, హెచ్​ఎక్స్​2 బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఫ్యాబ్రిక్ సీట్ అప్​హోలిస్ట్రీని కలిగి ఉంటుంది.

ఇందులో లెదరెట్ ఎలిమెంట్స్, యాంబియంట్ లైటింగ్ లేదా మెటల్ పెడల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండవు.

ఈ వేరియంట్‌లో కలర్ టీఎఫ్​టీ ఎంఐడీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కానీ, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్ లేదా స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవు.

హ్యుందాయ్​ ఎక్సటర్​ బేస్​ వేరియంట్​- సౌకర్యాలు..

కనీస అవసరాలను తీర్చే ఫీచర్లు మాత్రమే ఈ బేస్​ వేరియంట్​లో ఉన్నాయి:

మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఉన్నాయి.

ఫోల్డబుల్ కీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్‌లు, ఫ్రంట్ పవర్ అవుట్‌లెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

గమనిక: రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఇందులో ఉండవు. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్​వీఎంలు, వెనుక వైపు పవర్ విండోస్ కూడా ఈ బేస్ ట్రిమ్‌లో ఆఫర్ చేయడం లేదు.

2026 హ్యుందాయ్ ఎక్స్​టర్​ హెచ్​ఎక్స్​2 ధర ఎంత?

పెట్రోల్ ఇంజిన్: రూ. 5.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)

CNG పవర్‌ట్రైన్: రూ. 7.00 లక్షలు (ఎక్స్-షోరూమ్)

2026 హ్యుందాయ్​ ఎక్సటర్​ హెచ్​ఎక్స్​2 అనేది ఎటువంటి అదనపు ఆడంబరాలు లేని బేస్ వేరియంట్. ఇది భద్రత, ప్రాథమిక అవసరాలపై మాత్రమే దృష్టి పెడుతుంది. ప్రీమియం, టెక్-హెవీ ఫీచర్లు లేకపోయినప్పటికీ, కోర్ సేఫ్టీ, రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లను ఇది అందిస్తుంది. ఫీచర్ల కంటే తక్కువ ధర, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులకు ఇది ఒక సరైన ఎంట్రీ పాయింట్.

మరి మీరు ఈ ఎస్​యూవీని కొంటున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More