...
...
Next Story

15శాతం తగ్గిన ఐఫోన్​ ఎయిర్​ ధర- కొనాలా? వద్దా?

యాపిల్ నుంచి వచ్చిన అత్యంత పల్చని స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 17 ఎయిర్' ధర అమెజాన్‌లో భారీగా తగ్గింది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, కొన్ని ఫీచర్ల విషయంలో మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని నిరాశ పరచవచ్చు. ఆ పూర్తి వివరాలు మీకోసం..

Published on: Dec 25, 2025, 08:15:54 IST
Advertisement

ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు యాపిల్​ సంస్థ సరికొత్తగా పరిచయం చేసిన ‘ఐఫోన్ ఎయిర్’ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. లాంచ్ సమయంలో రూ. 1,19,900 ఉన్న ఈ ఫోన్ ధర, ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్లతో 15శాతం మేర తగ్గింది. కేవలం స్టైల్ కోసమే కాకుండా, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప డీల్ అని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఐఫోన్​ ఎయిర్​- అమెజాన్ డీల్ ఎలా పనిచేస్తుంది?

ఐఫోన్​ ఎయిర్​ ప్రైజ్​ డ్రాప్​.. (Shaurya Sharma - HT)
ఐఫోన్​ ఎయిర్​ ప్రైజ్​ డ్రాప్​.. (Shaurya Sharma - HT)

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఐఫోన్ ఎయిర్​ ధర ఎంఆర్‌పీ కంటే సుమారు రూ. 7,000 తక్కువగా అంటే రూ. 1,12,900 వద్ద లిస్ట్ అయింది. దీనికి తోడు రూ. 8,000 విలువైన డిస్కౌంట్ కూపన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఏదైనా ప్రముఖ బ్యాంకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే అదనంగా మరో రూ. 4,000 నుంచి 5,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా దాదాపు రూ. 19,000 వరకు తగ్గింపుతో ఈ లేటెస్ట్ ఐఫోన్ మీ సొంతం కావచ్చు.

ఐఫోన్ ఎయిర్ ఎందుకు కొనాలి?

స్టన్నింగ్ డిజైన్: ఐఫోన్ 17 సిరీస్ మొత్తంలో ఇదే అత్యంత ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇది యాపిల్ చరిత్రలోనే అత్యంత స్లిమ్​ ఐఫోన్. దీని థిక్​నెస్​ కేవలం 5.6 ఎంఎం మాత్రమే. చేతిలో పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ప్రో లెవల్ పర్ఫార్మెన్స్: మీరు రూ. 1.35 లక్షలు పెట్టి ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో పొందే అదే ఏ19 ప్రో చిప్‌సెట్ ఇందులోనూ ఉంటుంది. అంటే తక్కువ ధరకే ప్రో లెవల్ వేగాన్ని, గేమింగ్ అనుభవాన్ని ఈ 'ఎయిర్' మోడల్ మీకు అందిస్తుంది.

కొనే ముందు ఈ రెండు లోపాలను గమనించండి!

సింగిల్ స్పీకర్ సెటప్: ఐఫోన్ 17 సిరీస్‌లోని మిగతా ఫోన్లలో స్టీరియో స్పీకర్లు ఉంటే, ఎయిర్ మోడల్‌లో కేవలం సింగిల్ స్పీకర్‌ను మాత్రమే అందించారు. ఎక్కువ శబ్దాలు ఉండే ప్రదేశాల్లో దీని ఆడియో నాణ్యత అంతగా బాగుండదు. మీరు ఎక్కువగా సినిమాలు, వీడియోలు ఫోన్‌లోనే చూసేవారైతే ఇది మీకు కొంత అసంతృప్తిని కలిగించవచ్చు.

మీరు స్టైల్, బ్రాండ్ వాల్యూ, వేగానికి ప్రాధాన్యత ఇచ్చే వారైతే ఐఫోన్​ ఎయిర్​పై ఈ రూ. 19,000 తగ్గింపు ఆఫర్ సూపర్ ఛాన్స్. లేదు, నాకు బ్యాటరీ, ఆడియో చాలా ముఖ్యం అనుకుంటే మాత్రం సాధారణ ఐఫోన్ 17 వైపు చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe