ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసుల వార్తలపై స్పందించిన హరీశ్ రావు.. వారికి వార్నింగ్!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసుల వార్తలపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు స్పందించారు. చట్టవిరుద్ధమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

Published on: Dec 23, 2025, 15:44:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసు అందిందన్న వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందంచారు. తెలంగాణలో జరుగుతున్న విచారణలు, అరెస్టులను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సిట్‌లు ప్రహసనంగా మారాయని అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకులైన తమపై కేసులు కొత్త కాదని హరీష్ రావు పేర్కొన్నారు. కొంతమంది అధికారులు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం దూకుడుగా చట్టవిరుద్ధమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

హరీశ్ రావు
హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం అతిచేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పులను ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బందిపెడితే.. మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక రాజకీయ వర్గానికి చెందిన నాయకులను ఇబ్బంది పెడితే.. మీరు కూడా అదే విధిని ఎదుర్కొంటారని చెప్పారు.

మరోవైపు కేసీఆర్ ప్రెస్‌మీట్ గురించి హరీశ్ రావు మాట్లాడారు. రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడిందన్నారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చిట్‌చాట్ పెట్టడం చూడలేదని వ్యాఖ్యానించారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు వాస్తు భయం పట్టుకుందన్నారు. అందుకోసమే.. సచివాలయానికి పోవడం లేదని ఎద్దేవా చేశారు.

'బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాలుగు వేల మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పారు. కానీ పోలీస్ పహారా మధ్య వచ్చారు. ఇరిగేషన్‌ మీద పీపీటీని స్వాగతిస్తున్నాం, పీపీటీపై అసెంబ్లీలో మాకు సరిపడా అవకాశం ఇవ్వాలి.' అని హరీశ్ రావు అన్నారు.

అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్ కట్ చేయడంలాంటివి చేయవద్దని హరీశ్ రావు సూచించారు. ఎవరి వాదన నిజం అనేది ప్రజలు చూస్తారని చెప్పారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్‌కు ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ప్రభుత్వం భయపడుతుందన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ బట్టలు విప్పుతామన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More