...
...
Next Story

IPL 2026 : పంజాబ్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ - ఆసక్తికరంగా మారుతున్న ప్లే ఆఫ్స్ రేస్..!

IPL 2026 Gujarat Titans vs Punjab Kings : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జేసన్ హోల్డర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.

Published on: May 4, 2026, 07:08:24 IST
Advertisement

IPL 2026 Gujarat Titans vs Punjab Kings : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT) విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం!
గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం!

జేసన్ హోల్డర్ తన స్పెల్‌తో పంజాబ్ బ్యాటర్లను వణికించగా… ఛేదనలో సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ‘ఫినిషింగ్ టచ్’ గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాయి. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా…. పంజాబ్ కింగ్స్ ఓడినా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే పంజాబ్‌కు షాకిచ్చాడు. మొదటి ఓవర్ రెండో బంతికే ప్రియాంశ్ ఆర్య (2)ను అవుట్ చేసిన సిరాజ్…. తర్వాతి బంతికే కూపర్ కొన్నోలీని డకౌట్‌గా వెనక్కి పంపాడు. దీంతో పంజాబ్ 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (15) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా రబాడ ఆ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం రంగంలోకి దిగిన జేసన్ హోల్డర్ పంజాబ్ మిడిలార్డర్‌ను దెబ్బకొట్టాడు. నెహాల్ వధేరాను సున్నాకే వెనక్కి పంపిన హోల్డర్… కీలక సమయంలో అయ్యర్‌ను కూడా అవుట్ చేశాడు. పంజాబ్ 10 ఓవర్లలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సూర్యాంష్ షెడ్జ్ (57; 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (40; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆరో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. హోల్డర్ చివరికి 4 వికెట్లతో పంజాబ్‌ను 20 ఓవర్లలో 163/9 పరుగులకే పరిమితం చేశాడు.

సాయి సుదర్శన్ థర్డ్ ఫిఫ్టీ…

చివరి 3 ఓవర్లలో గుజరాత్ విజయానికి 24 పరుగులు కావాల్సి ఉంది. అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్లో హోల్డర్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా…. స్టోయినిస్ వేసిన బంతుల్లో వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అదరగొట్టాడు. అర్షద్ ఖాన్ (8 నాటౌట్) సహకారంతో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఆసక్తికరంగా ఫ్లే ఆఫ్ రేస్….

పంజాబ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో గుజరాత్ టైటాన్స్ .. సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ సరసన చేరింది. 10 మ్యాచులలో ఆరు విజయాలు(12 పాయింట్లు) సాధించింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచులో ఓడినా.. పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

వరుస విజయాలతో సత్తా చాటాతున్న గుజరాత్… ఐదు స్థానంలోకి చేరటంతో ఫ్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. రాబోయే మ్యాచ్ లు ప్రతి టీమ్ కు సవాల్ గా మారాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రాజస్థాన్ జట్టులకు ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ప్రస్తుతం మూడో స్థానంలో హైదరాబాద్, నాల్గో స్థానంలో రాజస్థాన్ ఉండగా… ఐదో స్థానంలో గుజరాత్ నిలిచింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks