వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ 15ఏళ్ల యువకుడు ఇప్పుడొక సంచలనం! రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యంగ్ గన్.. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చిత్తు చేశాడు. అయితే, ఈ రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అసలైన పరీక్ష ఎదురుకానుంది! ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్. అగ్రశ్రేణి బ్యాటర్లనే బెంబేలెత్తించే బుమ్రాని వైభవ్ డామినేట్ చేస్తే.. అతనికి టీమిండియా జెర్సీ అందడం ఖాయం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అసలైన పరీక్ష: బుమ్రా సెటప్..

షార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ వంటి సీనియర్లను ఉతికేసిన వైభవ్‌కు, బుమ్రా రూపంలో ఒక గండం ఎదురుకానుంది. దశాబ్ద కాలంగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బుమ్రా, తన బౌలింగ్‌ను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎవరికీ చిక్కని ఒక పజిల్ లా మారాడు. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ వంటి దిగ్గజాలు ఉన్నా, బుమ్రా రేంజ్ వేరు.
పైగా సూర్యవంశీని చూశాడు కాబట్టి, బుమ్రా ఇప్పటికే తన ప్లాన్‌ని రెడీ చేసి ఉంటాడు.
ఇద్దరిలోనూ ఉన్న ఆ కామన్ పాయింట్..
జస్ప్రీత్ బుమ్రా, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ మైదానంలో అత్యంత దూకుడుగా ఉంటారు. బుమ్రాను ఎవరైనా సవాలు చేస్తే అతను అస్సలు సహించడు. గత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సామ్ కాన్‌స్టాస్ ఇబ్బంది పెట్టినప్పుడు బుమ్రా విరుచుకుపడటాన్ని మనం చూశాం. వైభవ్ కూడా అంతే.. భయం అంటే ఏంటో తెలియని నైజం అతనిది. జోఫ్రా ఆర్చర్ లాంటి వేగవంతమైన బౌలర్‌ను కూడా మీడియం పేసర్‌లా స్మాష్ చేయడం వైభవ్ స్పెషాలిటీ.
వ్యూహం ఏంటి?..
వైభవ్ కోసం తమ దగ్గర పక్కా ప్లాన్స్ ఉందని ముంబై ఇండియన్స్ కోచ్ పారస్ మాంబ్రే చెప్పారు. బుమ్రా ప్రధాన అస్త్రం యార్కర్లు, స్లోయర్ బంతులు. వైభవ్ పవర్‌ప్లేలో రెచ్చిపోకుండా ఆపడమే బుమ్రా లక్ష్యం! తొలి 10 ఓవర్లలోనే బుమ్రా వైభవ్‌ను అవుట్ చేయగలిగితే ముంబైకి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. హార్దిక్ పాండ్యా కూడా కొత్త బంతితో సవాలు విసరవచ్చు, కానీ బుమ్రా వర్సెస్ వైభవ్ పోరు మాత్రం 'డిఫరెంట్ లెవల్'.
భారత జట్టులోకి ఎంట్రీ?
వైభవ్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుని, సీనియర్ భారత జట్టులోకి ఎంపికయ్యే అర్హత సాధించాడు. 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఉంటారా అనే చర్చ పక్కన పెడితే, వైభవ్ ఎప్పుడు అరంగేట్రం చేస్తాడనేదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు అబ్దుల్ ఖాదిర్ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి సచిన్ ఎలాగైతే ప్రపంచ క్రికెట్‌కి తన రాకను చాటాడో, ఇప్పుడు బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొంటే వైభవ్‌కు టీమ్ ఇండియా పిలుపు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}వైభవ్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుని, సీనియర్ భారత జట్టులోకి ఎంపికయ్యే అర్హత సాధించాడు. 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఉంటారా అనే చర్చ పక్కన పెడితే, వైభవ్ ఎప్పుడు అరంగేట్రం చేస్తాడనేదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు అబ్దుల్ ఖాదిర్ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి సచిన్ ఎలాగైతే ప్రపంచ క్రికెట్‌కి తన రాకను చాటాడో, ఇప్పుడు బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కొంటే వైభవ్‌కు టీమ్ ఇండియా పిలుపు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}జోస్ బట్లర్ వంటి దిగ్గజాలే వైభవ్ ఆటను చూసి ఆశ్చర్యపోతున్నారు. "ఇతను 21 లేదా 25 ఏళ్ల వయసులో ఎలా ఆడతాడో ఊహించుకోండి," అని బట్లర్ అనడం వైభవ్ టాలెంట్‌కు నిదర్శనం.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకత ఏమిటి?
వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇతని బ్యాటింగ్ శైలిని సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు.
2. బుమ్రా వర్సెస్ వైభవ్ పోరు ఎందుకు ముఖ్యం?
ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌ను ఎదుర్కొని నిలబడితే వైభవ్ అంతర్జాతీయ స్థాయి ఆటగాడని తేల్చేస్తారు (ఇప్పటికే టీమిండియాకు ఎంపిక చేయాలని కామెంట్లు వస్తున్నాయి). ఈ మ్యాచ లో రాణిస్తే వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.