iQOO 15R : 7600 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఐక్యూ 15ఆర్​- ధర ఎంతంటే..

భారీ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ డిజైన్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఐక్యూ 15ఆర్​ రాబోతోంది. కేవలం 7.9 ఎంఎం మందం కలిగిన ఈ ఫోన్ రూ. 50,000 లోపు ధరతో వన్‌ప్లస్ 15ఆర్​కి గట్టి పోటీ ఇవ్వనుంది.

Published on: Feb 2, 2026, 12:20:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరి 24న జరగనున్న అధికారిక ప్రకటనకు ముందే, ఐక్యూ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 15ఆర్​ గురించి కీలక వివరాలను వెల్లడిస్తోంది. అమెజాన్ మైక్రోసైట్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఐక్యూ 15ఆర్​ ధర, లాంచ్​ వివరాలు.. (Representative image)
ఐక్యూ 15ఆర్​ ధర, లాంచ్​ వివరాలు.. (Representative image)

ఈ స్మార్ట్​ఫోన్ గురించి ఇప్పటివరకు తెలిసిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

ఐక్యూ 15ఆర్​- భారీ బ్యాటరీ.. స్లిమ్ డిజైన్

అమెజాన్ పేజీలోని ఫుట్‌నోట్స్ ప్రకారం.. ఐక్యూ 15ఆర్​ ఏకంగా 7,600ఎంఏహెచ్​ సామర్థ్యం గల భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుంది. కానీ, ఐక్యూ ఇంజనీరింగ్ అద్భుతంతో ఈ ఫోన్ కేవలం 7.9ఎంఎం మందం మాత్రమే ఉండటం విశేషం. దీనికి 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

ఐక్యూ 15ఆర్​- ధర, పోటీ..

ఈ స్మార్ట్​ఫోన్ రూ. 50,000 లోపు ధరలో లాంచ్ కానుంది. తద్వారా మార్కెట్​లో రూ. 47,999 ధరకు లభించే వన్‌ప్లస్ 15ఆర్​కు ఇది ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. విశేషం ఏంటంటే.. ఈ రెండు ఫోన్లు కూడా లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి.

ఐక్యూ 15ఆర్​- గేమింగ్, సాఫ్ట్‌వేర్..

గేమర్ల కోసం ఇందులో క్యూ2 సూపర్‌కంప్యూటింగ్ చిప్‌ను అమర్చారు. ఇది బీజీఎంఐ వంటి గేమ్స్‌లో స్థిరమైన 144ఎఫ్​పీఎస్​ ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే:

ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6తో వస్తుంది.

4 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ ధృవీకరించింది.

ఐక్యూ 15ఆర్​- కెమెరా, డిస్‌ప్లే (అంచనా)

చైనాలో విడుదలైన ఐక్యూ జెడ్​11 టర్బో స్మార్ట్​ఫోన్​కి ఇది రీబ్రాండెడ్ వెర్షన్ అని నివేదికలు చెబుతున్నాయి. ఆ లెక్కన దీని స్పెసిఫికేషన్లు ఇలా ఉండవచ్చు:

డిస్‌ప్లే: 6.59-ఇంచ్​ ఓఎల్​ఈడీ ప్యానెల్, 1.5కే రిజల్యూషన్, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్.

కెమెరా: వెనుక వైపు ఓఐఎస్​ సపోర్ట్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా.

మెమరీ: 16జీబీ వరకు LPDDR5x ర్యామ్​, 512జీబీ వరకు యూఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్.

రంగులు: ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సిల్వర్ వేరియంట్ వెనుక భాగంలో ‘చెకర్డ్ డిజైన్’ ఆకట్టుకోనుంది.

లాంచ్​ నాటికి ఈ ఐక్యూ 15ఆర్​ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More