ఓవైపు ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోజ్తాబా ఖమేనీ తన మొదటి ప్రకటన విడుదల చేశారు. గురువారం టెలివిజన్ ప్రసంగంలో ఖమేనీ జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు. శత్రువులపై ఒత్తిడి తీసుకురావడానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంతేకాదు గల్ఫ్ దేశాల్లోని అన్ని అమెరికా స్థావరాలను వెంటనే మూసివేయాలని లేదంటే అటాక్ చేస్తూనే ఉంటామని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం. ఇరాన్ పొరుగు దేశాలతో స్నేహాన్ని విశ్వసిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని ఖమేనీ అన్నారు. యెమెన్‌లోని ప్రతిఘటన కూడా పని చేస్తుందని సుప్రీం నాయకుడు అన్నారు. ఇరాక్‌లోని సాయుధ గ్రూపులు కూడా ఇస్లామిక్ విప్లవానికి సహాయం చేయాలనుకుంటున్నాయి అని తెలిపారు.
'మన దేశం ఒత్తిడిలో, దాడిలో ఉన్న సమయంలో గొప్ప పని చేస్తున్న యోధులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇరాన్ పోరాటం కొనసాగిస్తుంది.' అని ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ అన్నారు.
'మినాబ్ పాఠశాలపై దాడి సహా పలు ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్ తన అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు. పొరుగు దేశాలతో ఇరాన్ స్నేహాన్ని విశ్వసిస్తోంది. అయినా అమెరికా స్థావరాలపై మాత్రం దాడులు కొనసాగుతాయి. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఇరాన్ కోరుకుంటోంది. దాడుల్లో గాయపడినవారికి ఉచితంగా చికిత్స అందిస్తాం. ఆర్థికంగానూ ఆదుకుంటాం.' అని ఇరాన్ సుప్రీం లీడర్ తన తొలి ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యాడు. తర్వాత మార్చి 9న ఇరాన్ సుప్రీం నాయకుడిగా నియమితులైన ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ మొదటిసారిగా ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యాడు. తర్వాత మార్చి 9న ఇరాన్ సుప్రీం నాయకుడిగా నియమితులైన ఆయతుల్లా మెుజ్తాబా ఖమేనీ మొదటిసారిగా ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}తన తండ్రిపై జరిగిన దాడిలో మోజ్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ దాడిలో కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ కుటుంబ సభ్యులు మరణించారు. 56 ఏళ్ల మెుజ్తాబా తన తండ్రి కంటే కఠినంగా, సంప్రదాయవాదిగా కనిపిస్తాడని చెబుతారు.
ఇరాన్ సీనియర్ మతాధికారులు మెుజ్తాబాను కొత్త సుప్రీంగా ఎంపిక చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేస్తూ.. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. 'అతను శాంతియుతంగా జీవించగలడని నేను నమ్మను.' అని వ్యాఖ్యానించారు అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉన్నప్పటికీ.. వైట్ హౌస్ మళ్లీ ఇరాన్ కొత్త సుప్రీం లక్ష్యంగా దాడులు చేస్తుందా? అనే చర్చ నడుస్తోంది. కానీ కేవలం వైమానిక దాడులు మాత్రమే ఇరాన్ నాయకత్వాన్ని గద్దె దించలేవని నిపుణులు అంటున్నారు. ఈ వారం వైమానిక, సముద్ర దాడులు తీవ్రతరం అయ్యాయి . ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.