ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ శనివారం (ఫిబ్రవరి 28) ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. రెండు రోజుల తరువాత సోమవారం ఖమేనీ భార్య కూడా మరణించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. దాడి తర్వాత ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా పలువురు ప్రముఖ నాయకులు, అధికారులు ఇజ్రాయెల్-అమెరికన్ సంయుక్త వైమానిక దాడిలో మరణించారు. ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఖమేనీ మరణం తర్వాత అతని భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే మరణ వార్త కూడా తాజాగా వెలువడింది. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. ఇరాన్ మీడియా సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారు. ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందింది అయితే పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది.
నివేదికల ప్రకారం, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే 1964లో వివాహం చేసుకున్నారు. ఖమేనీ భార్య ప్రజా జీవితానికి దూరంగా ఉండేవారు. ఎక్కవగా బయటకు వచ్చేవారు కాదు. అందుకే ఆమె గురించి చాలా తక్కువగా తెలుసు. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు కుమారు, ఇద్దరు కుమార్తెలు.
మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే తండ్రి పేరు మహ్మద్ ఇస్మాయిల్ ఖోజస్తే బగెర్జాదే. మషాద్‌లో వ్యాపారాలు చేస్తుండేవారు. ఇక మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే సోదరుడు హసన్.. ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీకి డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.
ఖమేనీ బంధువులు, ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కూడా ఈ దాడుల్లో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. దాడుల తర్వాత సుప్రీం లీడర్ కుటుంబంలో మరణాలు జరిగాయని ఇరాన్ మీడియా ధృవీకరించింది. సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సభ్యులను కోల్పోవడం టెహ్రాన్ నాయకత్వంపై అంతర్గత ఒత్తిడిని పెంచుతుందని, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దేశంపై ఏవైనా దాడులు జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఆ వైపుగానే దాడులు కూడా జరుగుతున్నాయి.
{{/usCountry}}ఖమేనీ బంధువులు, ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కూడా ఈ దాడుల్లో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. దాడుల తర్వాత సుప్రీం లీడర్ కుటుంబంలో మరణాలు జరిగాయని ఇరాన్ మీడియా ధృవీకరించింది. సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సభ్యులను కోల్పోవడం టెహ్రాన్ నాయకత్వంపై అంతర్గత ఒత్తిడిని పెంచుతుందని, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దేశంపై ఏవైనా దాడులు జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఆ వైపుగానే దాడులు కూడా జరుగుతున్నాయి.
{{/usCountry}}ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం, ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి కనీసం 555 మంది ఇరానీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో 130కి పైగా నగరాలపై దాడులు జరిగాయని కూడా అది పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్.. ఇరానియన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నావికాదళంపై బాంబు దాడి చేశాయి. అదే సమయంలో దాని అనేక యుద్ధనౌకలు ధ్వంసమయ్యాయి.