Iran Israel conflict : ముదురుతున్న ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం...! లెబనాన్ పై దాడులు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడి చేసింది. ఇందుకు ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా లెబనాన్ లోని హిజ్జుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు ఎటాక్ చేశారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ దాడుల్లో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక నివాస గృహంలో మంటలు చెలరేగినట్లు తెలిసింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.
సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. 2024లోనే హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి.
లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ తన స్థావరాలను కొనసాగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
హిజ్బుల్లా నియంత్రణలో ఉన్న దక్షిణ శివారు ప్రాంతాలైన బీరుట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. బీరూట్ సమీపంలో సీనియర్ హిజ్బుల్లా తీవ్రవాదులపై కూడా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
2024 లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి, ఖమేనీ చనిపోవటం పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా యుద్ధంలోకి దిగింది.
మరోవైపు ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగుతోంది. మధ్య ప్రాంతాల నుంచి "శత్రు ప్రదేశాలు" వైపు క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సోమవారం ఉదయం తెలిపింది.
మరోవైపు ఇరాన్ పై దాడి కొనసాగుతుందని వైట్ హౌస్(ఆమెరికా) ప్రకటించింది.ప్రస్తుతానికి… ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నిరంతరాయంగా కొనసాగుతోందని ఓ అధికారి చెప్పారు.
ఈ యుద్ధంలో భాగంగా కువైట్ లోని ఓ స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణాలను అమెరికా ధ్రువీకరించింది. ప్రాణాలు కోల్పోయిన సైనికులను నిజమైన అమెరికన్ దేశభక్తులు అంటూ ట్రంప్ అభివర్ణించారు. వారి మృతికి సంతాపంగా నివాళులు అర్పించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

