ప్రముఖ బహుళ రంగాల దిగ్గజం 'ఐటీసీ లిమిటెడ్' 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను జూలై 31న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) వార్షిక ప్రాతిపదికన 16.2 శాతం తగ్గి రూ.4,394.13 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.5,244.20 కోట్లుగా నమోదైంది.
గత త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే కంపెనీ నికర లాభం 18.4 శాతం క్షీణించింది. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి (Revenue from Operations) మాత్రం ఆకట్టుకుంది. వార్షిక ప్రాతిపదికన 27.6 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 23.9 శాతం వృద్ధి నమోదు చేసి రూ.29,523.30 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఈ రాబడి రూ.23,129.35 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఎబిటా (EBITDA) 24 శాతం తగ్గి రూ.5,181 కోట్లకు చేరింది.
స్టాండలోన్ ప్రాతిపదికన పరిశీలిస్తే, ఐటీసీ నికర లాభం 27.1 శాతం తగ్గి రూ.3,579 కోట్లకు పడిపోగా, రాబడి 14.4 శాతం తగ్గి రూ.16,812 కోట్లకు చేరింది.
సిగరెట్ల విభాగం.. రాబడి పెరిగినా తగ్గిన లాభం
సిగరెట్ల విభాగం గ్రాస్ రాబడి 80.6 శాతం పెరిగి రూ.15,383.55 కోట్లకు చేరింది. అయితే, నికర రాబడి 25 శాతం క్షీణించగా, పన్నుకు ముందు లాభం (PBT) 35 శాతం తగ్గి రూ.3,341.23 కోట్లకు పరిమితమైంది.
వినియోగదారులను నిలబెట్టుకోవడానికి అవసరమైన ధరల మార్పులను వేగంగా అమలు చేస్తున్నామని, పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక చర్యలు ప్రణాళికాబద్ధంగా ఫలితాలనిస్తున్నాయని ఐటీసీ యాజమాన్యం వెల్లడించింది.
ఆకట్టుకున్న ఎఫ్‌ఎమ్‌సిజీ.. పశ్చిమాసియా ప్రతికూలతలతో అగ్రి బిజినెస్
ఎఫ్‌ఎమ్‌సిజీ (ఇతర ఉత్పత్తులు) విభాగం రాబడి 12 శాతం పెరిగి రూ.6,481.95 కోట్లకు చేరగా, పిబిటి 21 శాతం పెరిగి రూ.478.61 కోట్లుగా నమోదైంది. డెయిరీ, స్నాక్స్, నూడుల్స్, ఫ్రోజెన్ స్నాక్స్ విభాగాలు 20 శాతానికి పైగా బలమైన వృద్ధిని సాధించాయి. పర్సనల్ కేర్ ఉత్పత్తులు, నోట్‌బుక్స్ వ్యాపారం మళ్లీ కోలుకున్నాయి.
{{/usCountry}}ఎఫ్‌ఎమ్‌సిజీ (ఇతర ఉత్పత్తులు) విభాగం రాబడి 12 శాతం పెరిగి రూ.6,481.95 కోట్లకు చేరగా, పిబిటి 21 శాతం పెరిగి రూ.478.61 కోట్లుగా నమోదైంది. డెయిరీ, స్నాక్స్, నూడుల్స్, ఫ్రోజెన్ స్నాక్స్ విభాగాలు 20 శాతానికి పైగా బలమైన వృద్ధిని సాధించాయి. పర్సనల్ కేర్ ఉత్పత్తులు, నోట్‌బుక్స్ వ్యాపారం మళ్లీ కోలుకున్నాయి.
{{/usCountry}}అటు పశ్చిమాసియాలో చోటుచేసుకున్న సైనిక ఘర్షణలు, అంతర్జాతీయ వాణిజ్యానికి ఏర్పడిన విఘాతాల వల్ల అగ్రి బిజినెస్ విభాగం తీవ్రంగా ప్రభావితమైంది. ఫలితంగా అగ్రి విభాగ రాబడి 16.6 శాతం తగ్గి రూ.8,082.06 కోట్లకు, లాభం 18.5 శాతం తగ్గి రూ.353.79 కోట్లకు పడిపోయింది.
పేపర్‌బోర్డ్, ప్యాకేజింగ్ విభాగంలో మెరుగైన ఫలితాలు
పేపర్‌బోర్డ్, పేపర్, ప్యాకేజింగ్ విభాగం రాబడి 9 శాతం పెరిగి రూ.2,307.24 కోట్లకు చేరగా, పన్నుకు ముందు లాభం ఏకంగా 38 శాతం పెరిగి రూ.224.22 కోట్లుగా నమోదైంది. లాభాల మార్జిన్లు 200 బేసిస్ పాయింట్లు మెరుగయ్యాయి.
కలప ధరలు అదుపులోకి రావడం, ఎగుమతులు పెరగడం, సమర్థవంతమైన వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని కంపెనీ వెల్లడించింది.