2026 జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అప్డేట్! జేఈఈ అడ్వాన్స్డ్ 2026 డేట్‌ని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. 2026 మే 17న ఈ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధిస్తారు.

జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) మోడ్‌లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్‌కి రెండు సెషన్స్ ఉంటాయి. 2026 జేఈఈ మెయిన్స్ 1 సెషన్ జనవరి 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్స్ 2వ సెషన్ ఏప్రిల్ 1-10 మధ్యలో జరుగుతుంది. ఫలితాలు అదే నెలలో వెలువడే అవకాశం ఉంది.
ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్టీఐలు, ఇతర విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ పేపర్ 1ని నిర్వహిస్తారు. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్ 2 ఉంటుంది.
వీటిల్లో పాసైన వారు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే ఐఐటీల్లో సీటు దొరుకుంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్డ్ ఒకటి అని చెబుతుంటారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షను వరుసగా మూడు సార్లు (ప్రతి ఏడాది రెండుసార్లు) అటెంప్ట్ చేయవచ్చు. కానీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ని మాత్రం వరుసా రెండుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది.
జేఈఈ మెయిన్స్ పేపర్ 1లో ఎంసీక్యూలు, న్యమూరికల్ ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మల్టిపుల్ ఛాయిస్, న్యమూరికల్, ఇంటజర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1..
{{/usCountry}}జేఈఈ మెయిన్స్ పేపర్ 1లో ఎంసీక్యూలు, న్యమూరికల్ ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మల్టిపుల్ ఛాయిస్, న్యమూరికల్, ఇంటజర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1..
{{/usCountry}}జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అప్లికేషన్ ఫామ్ ప్రక్రియ ఇప్పటికే ముగిశాయి. అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష కోసం తీవ్రస్థాయిలో ప్రిపేర్ అవుతున్నారు.
కాగా జేఈఈ మెయిన్స్ 2026లో కాలిక్యులేటర్ ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.