Sign in

JEE అభ్యర్థులకు అప్డేట్​! 2026 జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష ఎప్పుడంటే..

JEE అభ్యర్థులకు అప్డేట్​! 2026 జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు సంబంధించిన డేట్​పై క్లారిటీ వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 7, 2025, 09:10:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 జేఈఈ కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026 డేట్​ని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. 2026 మే 17న ఈ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధిస్తారు.

జేఈఈ అభ్యర్థులకు అలర్ట్​..
జేఈఈ అభ్యర్థులకు అలర్ట్​..

జేఈఈ మెయిన్స్​, జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​) మోడ్​లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్​కి రెండు సెషన్స్​ ఉంటాయి. 2026 జేఈఈ మెయిన్స్​ 1 సెషన్​ జనవరి 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్స్​ 2వ సెషన్​ ఏప్రిల్​ 1-10 మధ్యలో జరుగుతుంది. ఫలితాలు అదే నెలలో వెలువడే అవకాశం ఉంది.

ఎన్​ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్​టీఐలు, ఇతర విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్​లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్​ పేపర్​ 1ని నిర్వహిస్తారు. బీఆర్క్​, బీప్లానింగ్​ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్​ 2 ఉంటుంది.

వీటిల్లో పాసైన వారు జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే ఐఐటీల్లో సీటు దొరుకుంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్​డ్​ ఒకటి అని చెబుతుంటారు.

జేఈఈ మెయిన్స్​ పరీక్షను వరుసగా మూడు సార్లు (ప్రతి ఏడాది రెండుసార్లు) అటెంప్ట్​ చేయవచ్చు. కానీ జేఈఈ అడ్వాన్స్​డ్​ని మాత్రం వరుసా రెండుసార్లు మాత్రమే రాసే అవకాశం ఉంటుంది.

జేఈఈ మెయిన్స్ పేపర్​ 1లో ఎంసీక్యూలు, న్యమూరికల్​ ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్​డ్​లో మల్టిపుల్​ ఛాయిస్​, న్యమూరికల్​, ఇంటజర్​ టైప్​ ప్రశ్నలు ఉంటాయి.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1..

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, అప్లికేషన్​ ఫామ్​ ప్రక్రియ ఇప్పటికే ముగిశాయి. అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష కోసం తీవ్రస్థాయిలో ప్రిపేర్​ అవుతున్నారు.

కాగా జేఈఈ మెయిన్స్​ 2026లో కాలిక్యులేటర్​ ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More