...
...
Next Story

JEE Mains 2026 : జేఈఈ మెయిన్స్ సెషన్​ 1​ ఫైనల్​ ఆన్సర్​ కీ విడుదల- డైరక్ట్​ లింక్​..

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్​. జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఆన్సర్​ కీని ఎన్టీఏ తాజాగా విడుదల చేసింది. ఎలా చెక్​ చేసుకోవాలి? డైరక్ట్​ లింక్​ ఎలా పొందాలి? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 16, 2026 10:59 AM IST
Advertisement

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్​ 2026 సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా తమ సమాధానాలను సరిచూసుకోవచ్చు. ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో ఫలితాలు (Results) కూడా మరికొద్ది సేపట్లోనే వెలువడే అవకాశం ఉంది.

జేఈఈ మెయిన్స్​ 2026- 9 ప్రశ్నలు తొలగింపు.. ఆ మార్కులు ఎవరికి?

జేఈఈ మెయిన్స్ సెషన్​ 1​ ఫైనల్​ ఆన్సర్​ కీ విడుదల..
జేఈఈ మెయిన్స్ సెషన్​ 1​ ఫైనల్​ ఆన్సర్​ కీ విడుదల..

ఈసారి విడుదల చేసిన జేఈఈ మెయిన్స్​ 2026 ఫైనల్ ఆన్సర్ కీలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. మొత్తం 9 ప్రశ్నలను ఎన్టీఏ తొలగించింది. సాధారణంగా ప్రశ్నలో తప్పున్నా లేదా ఆప్షన్లలో స్పష్టత లేకపోయినా ఇలా తొలగిస్తుంటారు. దీనివల్ల అభ్యర్థుల స్కోర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1- ఆన్సర్​ కీ ఎలా చూసుకోవాలి?

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఫైనల్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్​ని అనుసరించండి:

స్టెప్​ 1- మొదట jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'JEE Main Final Answer Key 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త విండోలో పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

స్టెప్​ 4- అందులో మీ సెట్ ప్రకారం సమాధానాలను సరిచూసుకుని, కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ ఫలితాలు వెలువడినప్పుడు ఇక్కడ అప్డేట్​ చేస్తాను. చెక్​ చేసుకోండి.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఆన్స్​ర్​ కీ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక చేయండి.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1- పరీక్ష వివరాలు..

షిఫ్టులు: పేపర్-1 పరీక్షలు రెండు షిఫ్టుల్లో (ఉదయం 9-12, మధ్యాహ్నం 3-6) జరగగా, పేపర్-2 చివరి రోజున ఒకే షిఫ్టులో జరిగింది.

కీ ప్రాసెస్: ఫిబ్రవరి 4న ప్రాథమిక కీ విడుదల చేయగా, ఫిబ్రవరి 6 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాతే నేడు తుది కీని ప్రకటించారు.

ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఎన్టీఏ సూచించింది.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న- జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఫలితాల రీ-వాల్యుయేషన్​, రీ-చెకింగ్​ వెసులబాటు ఉందా?

సమాధానం- జేఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఫలితాల రీ-వాల్యుయేషన్​, రీ- చెకింగ్​కి వెసులుబాటు లేదు. ఎలాంటి అభ్యర్థనలను కూడా స్వీకరించారు.

ప్రశ్న- జేఈఈ మెయిన్స్​ 2026లో ఎవరి ఫలితాలను వెల్లడించరు?

సమాధానం- తప్పుడు మార్గాల్లో పరీక్షలు రాసేందుకు ప్రయత్నించిన వారి ఫలితాలను రద్దు చేయవచ్చు లేదా ప్రకటించకపోవచ్చు. కేటాయించిన సెంటర్​లో కాకుండ ఇతర సెంటర్​లో పరీక్ష రాసిన వారు లేదా తమ స్థానంలో మరొకరి చేత పరీక్ష రాయించిన వారి ఫలితాలు కూడా ప్రకటించమని ఎన్టీఏ తేల్చి చెప్పింది. ఒక సెషన్​లో ఒకటి కన్నా ఎక్కువసార్లు పరీక్ష రాసిన వారి ఫలితాలు కూడా వెలువడవు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON