త్వరలోనే JEE Mains 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పరీక్షా కేంద్రాన్ని చెక్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

Published on: Jan 7, 2026, 05:44:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2026 సెషన్​ 1 పరీక్షకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలోనే 'సిటీ ఇంటిమేషన్ స్లిప్‌'లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అభ్యర్థులు తమ పరీక్ష ఏ నగరంలో ఉంటుందో ముందుగానే తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ స్లిప్​ని ఎలా డౌన్​లోడ్​చేసుకోవాలి? ఎప్పుడు విడుదల అవుతుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓ పరీక్షా కేంద్రం వద్ద జేఈఈ మెయిన్స్​ అభ్యర్థులు..
ఓ పరీక్షా కేంద్రం వద్ద జేఈఈ మెయిన్స్​ అభ్యర్థులు..

జేఈఈ మెయిన్స్ 2026​ సిటీ ఇంటిమేషన్​ స్లిప్​..

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్​ 1 పరీక్షలు జనవరి 21న ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో జనవరి 15లోపు పరీక్షా నగరాల వివరాలను ఎన్టీఏ వెల్లడించే అవకాశం ఉంది.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఈ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2026 సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in సందర్శించండి.

స్టెప్​ -2 హోమ్ పేజీలో 'Candidate Activity' విభాగంలో ఉన్న 'City Slip Download Link'పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయండి.

స్టెప్​ 4- లాగిన్ అయిన తర్వాత మీ సిటీ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 5- దానిని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసి పెట్టుకోండి.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 ఫలితాలు..

జేఈఈ మెయిన్స్​ సెషన్ 1 పరీక్ష: జనవరి చివరి వారం.

సెషన్ 1 ఫలితాలు: ఫిబ్రవరి 12, 2026 లోపు.

జేఈఈ మెయిన్స్​ సెషన్ 2: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు.

సెషన్ 2 ఫలితాలు: ఏప్రిల్ 20, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ పరీక్షలను ఎన్టీఏ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తోంది.

గుర్తింపు కార్డుల అప్‌లోడ్ తప్పనిసరి..

అభ్యర్థులు తమ ఐడెంటిటీ ప్రూఫ్ (గుర్తింపు కార్డు)ను పీడీఎఫ్ రూపంలో అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని ఎన్టీఏ ఇప్పటికే సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి జనవరి 15 వరకు సమయాన్ని ఇచ్చింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గడువు లోపే తమ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎప్పుడు?

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అర్హత పొందిన అభ్యర్థులు 'జేఈఈ అడ్వాన్స్‌డ్' పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17న రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు) జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23, 2026న ప్రారంభం కానుంది.

విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More