భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి సమయం ఆసన్నమైంది! ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) డిజిటల్ విభాగామైన 'జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్' ఐపీఓ ప్రక్రియను అధికారికంగా వేగవంతం చేసింది. కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’కి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) పత్రాలను దాఖలు చేసింది. ఈ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా దాదాపు రూ. 30,200 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) సమీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది.
అక్టోబర్ 21 నుంచి జీయో ఐపీఓ ప్రారంభం..
జియో ఐపీఓ ప్రైజ్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 1,069 నుంచి రూ. 1,119 గా ఖరారు చేశారు. ఈ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది. అక్టోబర్ 28న ఈ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లలో లిస్ట్ కానున్నాయి.
పెట్టుబడిదారులు కనీసం 12 షేర్ల (రూ. 10 ఫేస్ వ్యాల్యూ) చొప్పున ఒక లాట్‌గా, ఆపై 12 షేర్ల గుణకాలలో బిడ్లు దాఖలు చేయవచ్చు. ఇక అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఉద్యోగుల కోటా కింద ఒక్కో షేరుపై రూ. 54 చొప్పున డిస్కౌంట్ ప్రకటించడం విశేషం.
దేశీయ మార్కెట్లో జియో ఐపీఓ సరికొత్త రికార్డు!
గతంలో డ్రాఫ్ట్ పత్రాలలో ప్రతిపాదించిన రూ. 35,000 కోట్లతో పోలిస్తే, సవరించిన ఇష్యూ పరిమాణం దాదాపు 14 శాతం తక్కువగా ఉంది. అయితే మొత్తం 2.7 కోట్ల (270 మిలియన్) నూతన షేర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. స్వదేశీ మ్యూచువల్ ఫండ్లతో చర్చల అనంతరం, లిస్టింగ్ తర్వాత మదుపరులకు ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాలు మిగిలి ఉండేలా ధరల శ్రేణిని రీ-క్యాలిబ్రేట్ చేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఐపీఓ పరిమాణంలో కొద్దిపాటి కోత విధించినప్పటికీ, రూపాయి విలువ పరంగా భారత్‌లోనే అత్యంత భారీ ఐపీఓగా జియో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. గతేడాది 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నమోదు చేసిన రూ. 27,870 కోట్ల ఐపీఓ రికార్డును ఇది అధిగమించనుంది.
జియో ఐపీఓ ద్వారా వచ్చే నిధులను దేనికి వాడతారు?
{{/usCountry}}ఐపీఓ పరిమాణంలో కొద్దిపాటి కోత విధించినప్పటికీ, రూపాయి విలువ పరంగా భారత్‌లోనే అత్యంత భారీ ఐపీఓగా జియో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. గతేడాది 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నమోదు చేసిన రూ. 27,870 కోట్ల ఐపీఓ రికార్డును ఇది అధిగమించనుంది.
జియో ఐపీఓ ద్వారా వచ్చే నిధులను దేనికి వాడతారు?
{{/usCountry}}ఐపీఓ ద్వారా సమకూరే నిధుల్లో దాదాపు రూ. 27,500 కోట్లను తమ ప్రధాన సబ్సిడీ సంస్థ అయిన 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్' పేరుపై ఉన్న పాత రుణాల చెల్లింపుకు వినియోగించాలని కంపెనీ ప్రణాళిక రచించింది. ఇది కంపెనీపై వడ్డీ భారాన్ని తగ్గించి, మరింత లాభదాయకతకు దోహదపడనుంది.
అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రధాన నగరాల్లో ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ నేతృత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్ రోడ్‌షోలు నిర్వహించిన అనంతరం ఈ ఆఫర్ పత్రాలను సెబీకి సమర్పించారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 66.43 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా 9.98 శాతం, గూగుల్ 7.73 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఇవే కాకుండా కేకేఆర్, విస్టా ఈక్విటీ, సిల్వర్ లేక్, ముబాతలా, జనరల్ అట్లాంటిక్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు కూడా వాటాదారులుగా ఉన్నారు.
జియో ఐపీఓ- ఆర్థికంగా బలమైన పనితీరు..
దేశీయంగా అత్యధిక వైర్లెస్ సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న టెలికాం రంగంలో జియో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతోంది. జాతీయ టెలికాం నియంత్రణ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ఆగస్టు నాటికి జియో 50.84 కోట్ల (508.43 మిలియన్ల) మొబైల్ వినియోగదారులతో మొదటి స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 49.16 కోట్ల మందితో రెండో స్థానంలో, వోడాఫోన్ ఐడియా (వీఐ) 19.95 కోట్ల మందితో మూడో స్థానంలో నిలిచాయి.
ఆర్థిక ఫలితాల పరంగా ఎఫ్వై26లో జియో ప్లాట్ఫార్మ్స్ నికర లాభం 15 శాతం పెరిగి రూ. 30,053 కోట్లకు చేరుకుంది. మొత్తం రాబడి 14.5 శాతం వృద్ధితో రూ. 1.47 లక్షల కోట్లకు చేరింది. కంపెనీ ఎబిట్డా రూ. 76,255 కోట్లుగా నమోదు కాగా, మార్జిన్లు 51.9 శాతంగా నమోదయ్యాయి.
జియో ఐపీఓ- గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, ప్రభావం..
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షల ప్రభావం వల్ల భారత్ ఈక్విటీ మార్కెట్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిఫ్టీ50 సూచీ కూడా ఒత్తిడికి గురవుతోంది. ఇలాంటి ఆందోళనకర వాతావరణంలోనూ జియో బ్రాండ్ బలం, నిలకడైన లాభాల దృష్ట్యా ఈ మెగా ఐపీఓపై ప్రాథమిక మార్కెట్ మదుపరులు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.