...
...
Next Story

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ పార్టీ ప్రతినిధుల భేటీ.. ముఖ్యమైన 3 డిమాండ్లు

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో కొన్ని డిమాండ్లతో కూడిన లేఖను అందజేశారు.

Published on: Jul 20, 2026 05:38 PM IST
Advertisement

కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. వారు తమ మూడు ప్రధాన డిమాండ్ల జాబితాను నడ్డాకు సమర్పించారు. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా నడ్డాను కలిశారు. విద్యార్థుల డిమాండ్లపై నడ్డా, సీజేపీ బృందం సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సమావేశం కోసం కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, జేపీ నడ్డా వద్దకు వచ్చారు.

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు భేటీ
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు భేటీ

ఈ సందర్భంగా వారు తమ డిమాండ్ల జాబితాను జేపీ నడ్డాకు అందజేశారు. చర్చల కోసం ప్రభుత్వమే తమను సంప్రదించిందని సీజేపీ పేర్కొంది. ఇదిలా ఉండగా సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్.. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ తర్వాత దీక్ష విరమిస్తున్నట్టుగా ప్రకటించారు.

సమావేశం అనంతరం తాను అశుతోష్ రాంకాతో కలిసి జేపీ నడ్డా నివాసంలో ఆయనను కలిసినట్లు సౌరవ్ దాస్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయడం లేదా ఆయన్ను పదవి నుంచి తొలగించడం వంటి తమ డిమాండ్లను ఆయనకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తగిన స్థాయిలో చర్చిస్తానని జేపీ నడ్డా వారికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి గట్టి హామీ లభించలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పారటీ స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు 3 కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు

2. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలి

3. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి.

ఈ గందరగోళం మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. విద్యార్థుల పార్లమెంట్ మార్చ్ జరుగుతున్న వేళ జరిగిన ఈ సమావేశం సుమారు గంటసేపు కొనసాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోం మంత్రి అమిత్ షా కాక్రోచ్ జనతా పార్టీ.. నిరసనపై చర్చించారు.

సీజేపీ పార్లమెంట్ మార్చ్ అనంతరం ప్రభుత్వం, ప్రతినిధి బృందం మధ్య చర్చలు కొనసాగుతుండగా పోలీసులు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను చెదరగొట్టడం ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశాన్ని పోలీసులు ఖాళీ చేయించి, ధర్నా చేస్తున్న సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతేకాకుండా మార్చ్ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపానికి చేరుకున్న నిరసనకారులను కూడా తొలగించారు. కాక్రోచ్ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌తో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe