తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీకి తిరుగులేని ముఖచిత్రంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై, ఇప్పుడు అదే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కకపోవడం, అలాగే పార్టీ ఘోర పరాజయం పాలుకావడంతో అన్నామలై భవిష్యత్తు అడుగులపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన సోమవారం చెన్నై నుంచి దిల్లీకి పయనం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
దిల్లీకి అన్నామలై.. కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నామలై మంగళవారం దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు పార్టీ అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన బయలుదేరుతున్న సమయంలో విలేకరులు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"దయచేసి రెండు రోజులు వేచి చూడండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం" అని అన్నామలై సమాధానమిచ్చారు. దీనితో ఆయన తదుపరి నిర్ణయం ఏంటనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి..
కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కె. అన్నామలై, తొమ్మిదేళ్ల సర్వీస్ తర్వాత 2020లో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది భారతీయ జనతా పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, అధిష్ఠానం ఆయనకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
తెర వెనుక ఏం జరిగింది?
గతేడాది జరిగిన పార్టీ అంతర్గత పరిణామాల్లో అన్నామలై మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టడంతో అన్నామలై క్రమంగా లైమ్‌లైట్‌కు దూరమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 234 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 6 నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మాత్రమే ఆయనకు కేటాయించారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై అప్పట్లో ప్రకటించినప్పటికీ, కేవలం ఆరు స్థానాలకే తనను పరిమితం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల పరాజయం.. భవిష్యత్తుపై సందిగ్ధత
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తానే స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నానని, ఎన్డీయే (NDA) కూటమి అభ్యర్థుల ప్రచారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అధిష్ఠానానికి లిఖితపూర్వకంగా తెలిపినట్లు అన్నామలై వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమైంది. మొత్తం 234 స్థానాల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ దారుణ ఫలితాలు అన్నామలై అసంతృప్తిని మరింత పెంచాయని తెలుస్తోంది.
{{/usCountry}}2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తానే స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నానని, ఎన్డీయే (NDA) కూటమి అభ్యర్థుల ప్రచారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అధిష్ఠానానికి లిఖితపూర్వకంగా తెలిపినట్లు అన్నామలై వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమైంది. మొత్తం 234 స్థానాల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ దారుణ ఫలితాలు అన్నామలై అసంతృప్తిని మరింత పెంచాయని తెలుస్తోంది.
{{/usCountry}}బీజేపీలో తనకు సరైన అవకాశాలు గానీ, రాజకీయ భవిష్యత్తు గానీ లేదని అన్నామలై భావిస్తున్నట్లు ఒక సీనియర్ బీజేపీ నేత పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత అన్నామలై తన రాజకీయ ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాలి.