...
...
Next Story

రాహుల్ గాంధీ ఒక 'టపోరి'.. ఆయన్ను చూస్తుంటే మహిళలకు అసౌకర్యంగా అనిపిస్తుంది: కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన ప్రవర్తన ఒక 'టపోరి' (పోకిరీ) లా ఉంటుందని, ఆయన తీరు మహిళలకు ఇబ్బందికరంగా ఉందని ఆరోపించారు. మరోవైపు రాహుల్ తీరుపై మాజీ బ్యూరోక్రాట్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు.

Published on: Mar 18, 2026, 16:35:39 IST
Advertisement

రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీని ఒక 'టపోరి' (వీధి రౌడీ లేదా పోకిరీ) తో పోల్చిన కంగనా, ఆయన బహిరంగ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

"మహిళలకు అసౌకర్యంగా అనిపిస్తుంది"

కంగనా రనౌత్ (PTI)
కంగనా రనౌత్ (PTI)

పార్లమెంట్ సముదాయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కంగనా రనౌత్, రాహుల్ గాంధీ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఆయన్ను చూస్తుంటే మా మహిళలకు చాలా అసౌకర్యంగా (Uncomfortable) అనిపిస్తుంది. ఆయన ఒక టపోరిలా వస్తారు.. ఎవరినైనా 'ఏయ్ నువ్వు' అంటూ ఏకవచనంతో అగౌరవంగా పిలుస్తారు. ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తుంటే వెనుక నుంచి కూతలు కూస్తారు (Hooting)” అని కంగనా రనౌత్ ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఏమాత్రం హుందాగా లేదని ఆమె పేర్కొన్నారు.

క్షమాపణలు కోరుతూ మాజీ అధికారుల బహిరంగ లేఖ

కంగనా వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాహుల్ గాంధీ పార్లమెంట్ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ 84 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 116 మంది మాజీ సైనికోద్యోగులు, నలుగురు లాయర్లు కలిసి ఒక బహిరంగ లేఖ రాశారు. మార్చి 12న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మకర్ ద్వార్ ప్రవేశ ద్వారం వద్ద రాహుల్ గాంధీ టీ, బిస్కెట్లు తీసుకున్న ఘటనపై వీరంతా అభ్యంతరం వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ నేతృత్వంలోని ఈ బృందం, రాహుల్ ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలను బేఖాతరు చేసేలా ఉందని పేర్కొంది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ మర్యాదను కాపాడాలని రాహుల్ గాంధీకి సూచించినప్పటికీ, ఆయన పట్టించుకోలేదని ఎస్పీ వైద్ విమర్శించారు. రాహుల్ తన ప్రవర్తనతో తనను తాను ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా మార్చుకుంటున్నారని, ప్రతిపక్ష నాయకుడికి అహంకారం ఉండకూడదని, వినయం ఉండాలని ఆయన హితవు పలికారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe