Electric scooter : ఓలా, టీవీఎస్​కి గట్టి పోటీగా ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- సిటీ రైడ్​కి బెస్ట్​!

Electric scooter for city ride : కీవే ఈజెడ్​ఐ హైప్‌వోల్ట్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లా లాంచ్​కు రెడీ అవుతోందని తెలుస్తోంది. కేవలం లుక్స్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్, టెక్నాలజీ పరంగానూ ప్రస్తుత మార్కెట్​లోని అగ్రశ్రేణి ఈవీ స్కూటర్లకు పోటీ ఇస్తుంది. ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 31, 2026, 10:44:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Keeway EZI Hypevolt Electric Scooter : హంగేరియన్ ప్రీమియం టూ-వీలర్ బ్రాండ్ కీవే.. భారత ఈవీ మార్కెట్​లోకి సరికొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కీవే ఈజెడ్​ఐ హైప్‌వోల్ట్’ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ స్కూటర్, త్వరలోనే భారత ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి అడుగుపెట్టనుంది! యువతను ఆకట్టుకునేలా షార్ప్ బాడీ ప్యానెల్స్, అదిరిపోయే స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ స్కూటర్.. వీ1, వీ2 అనే రెండు పవర్‌ఫుల్ వేరియంట్లలో లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..

ఈజెడ్​ఐ హైప్​వోల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈజెడ్​ఐ హైప్​వోల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈజెడ్​ఐ హైప్​వోల్ట్​ ఎలక్ట్రిక్ స్కూటర్​- డిజైన్, ప్రీమియం ఫీచర్లు..

లుక్ అండ్ డిజైన్: ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ల్పిట్-స్టైల్ సీట్లు, షార్ప్ బాడీ డిజైన్, పెద్దవైన 14-ఇంచుల అలాయ్ వీల్స్ అందించారు.

రైడింగ్ కంఫర్ట్: ఈ ఈ- స్కూటర్ వీల్‌బేస్ 1,454 ఎంఎం, సీట్ హైట్ 770 ఎంఎంగా ఉంది. దీనివల్ల ఎక్కువ ఎత్తు లేని రైడర్లు కూడా ట్రాఫిక్‌లో దీనిని చాలా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. సీటు కింద ఫుల్-ఫేస్ హెల్మెట్ పట్టేంత భారీ స్టోరేజ్ స్పేస్ ఉంది.

ఆధునిక టెక్నాలజీ: ఇందులో 5-ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ స్టార్ట్/లాక్ సిస్టమ్ ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు: ప్రీమియం కార్లలో కనిపించే ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ కెమెరా, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులతో కూడిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివి ఈ ఈజెడ్​ఐ హైప్​వోల్ట్​ ఎలక్ట్రిక్ స్కూటర్​లో అందించారు.

ఈజెడ్​ఐ హైప్​వోల్ట్​ ఎలక్ట్రిక్ స్కూటర్​- పవర్​, రేంజ్.,

కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా కీవే ఈ స్కూటర్‌ను రెండు ఆప్షన్లలో తీసుకురానుంది:

1. కీవే ఈజెడ్​ఐ హైప్‌వోల్ట్ వీ1 వేరియంట్ :

ఇది బడ్జెట్ పరిధిలో రోజువారీ సిటీ ప్రయాణాలు చేసే వారి కోసం డిజైన్ చేశారు.

బ్యాటరీ: 2.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల సింగిల్ 72వీ 35ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్.

పవర్ అండ్ స్పీడ్: 2,000డబ్ల్యూ మోటార్ పవర్‌తో ఇది గరిష్టంగా 80 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్‌తో వెళ్తుంది.

రేంజ్: సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 65 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. బ్యాటరీతో కలిపి దీని బరువు 124 కేజీలు.

2. కీవే ఈజెడ్​ఐ హైప్‌వోల్ట్ వీ2 వేరియంట్ :

ఎక్కువ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, లాంగ్ రేంజ్ కోరుకునే వారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్.

బ్యాటరీ: ఇందులో పార్లల్ సెటప్‌తో కూడిన డ్యూయల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. దీని మొత్తం సామర్థ్యం 5 కేడబ్ల్యూహెచ్.

పవర్ అండ్ స్పీడ్: 6,000డబ్ల్యూ పవర్‌ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ వేరియంట్ కొండ ప్రాంతాలు, ఎత్తైన రోడ్లను సులభంగా ఎక్కగలదు. దీని టాప్ స్పీడ్ ఏకంగా 115 కేఎంపీహెచ్

రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 125 కిలోమీటర్ల మైలేజ్/రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీని బరువు దాదాపు 150 కేజీలు ఉంటుంది.

ఇండియన్ వెర్షన్‌లో మార్పులు?

అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన మోడల్ స్పెసిఫికేషన్లు ఇవే అయినప్పటికీ, భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి వెర్షన్‌లో బ్యాటరీ సైజ్, మోటార్ పవర్, రేంజ్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.

భారత మార్కెట్​లో ఉన్న ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ కీవే హైప్‌వోల్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. దీని లాంచ్, ధరల వివరాలు కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More