ఇదీ ఇండియా పవర్ అంటే.. ఇది కదా భారత క్రికెట్ సత్తా అంటే.. సొంతగడ్డపై మన క్రికెట్ టీమ్ అదరగొట్టింది. వరుసగా రెండో సారి, మొత్తంగా మూడో సారి టీ20 ప్రపంచకప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించి, ఇండియా హీరోలుగా మారిన ఆటగాళ్ల గురించి తెలుసుకోండి.
సంజు శాంసన్

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సంజు శాంసన్ గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు శాంసన్. ఫస్ట్ ఫైనల్ ఎలెవన్ లోనే లేని శాంసన్.. టీమ్ డిఫరెంట్ కాంబినేషన్ ప్లాన్ కారణంగా జట్టులోకి వచ్చాడు. 5 ఇన్నింగ్స్ ల్లో 321 రన్స్ తో టీమ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషంచాడు. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక రన్స్ చేసింది అతనే.
ఇషాన్ కిషన్
ఈ పొట్టి కప్ లో డైనమైట్ లా పేలాడు ఇషాన్ కిషన్. కొన్ని నెలల కిందట వరకూ అసలు ఇండియా టీ20 టీమ్ సెటప్ లోనే ఇషాన్ కు ప్లేస్ లేదు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్ తో తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ కు సెలెక్ట్ అయ్యాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ పై కీలక ఇన్నింగ్స్ సహా బ్యాటింగ్ లో అదరగొట్టాడు. 9 ఇన్నింగ్స్ ల్లో 317 పరుగులు చేశాడు.
శివమ్ దూబె
శివమ్ దూబెపై ప్రశంసలు కురిపించిన ఇండియన్ ఫ్యాన్ ఉండడు. ముఖ్యంగా ఫైనల్లో ఆఖరి ఓవర్లో అతని విధ్వంసం టీమ్ గెలుపుపై నమ్మకాన్ని ఇచ్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్ లో చెలరేగిన అతను 9 ఇన్నింగ్స్ ల్లో 235 పరుగులు చేశాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఆఖరి ఓవర్లో బౌలింగ్ కూడా అదరగొట్టాడు.
బుమ్రా
{{/usCountry}}శివమ్ దూబెపై ప్రశంసలు కురిపించిన ఇండియన్ ఫ్యాన్ ఉండడు. ముఖ్యంగా ఫైనల్లో ఆఖరి ఓవర్లో అతని విధ్వంసం టీమ్ గెలుపుపై నమ్మకాన్ని ఇచ్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్ లో చెలరేగిన అతను 9 ఇన్నింగ్స్ ల్లో 235 పరుగులు చేశాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఆఖరి ఓవర్లో బౌలింగ్ కూడా అదరగొట్టాడు.
బుమ్రా
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ లో ఇండియా విజేతగా నిలిచిందంటే మరో ప్రధాన కారణం జస్ ప్రీత్ బుమ్రా. గ్రౌండ్ ఏదైనా, పిచ్ ఎలా ఉన్నా తనదైన టాప్ క్లాస్ బౌలింగ్ తో ఇండియాకు వికెట్లు అందించాడు బుమ్రా. ముఖ్యంగా సెమీస్ లో మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఇంగ్లాండ్ పై బుమ్రా బౌలింగ్ అద్భుతమే.
ఇక ఫైనల్లోనూ 4 వికెట్లతో బుమ్రా అదరగొట్టాడు. ఈ టోర్నీలో బుమ్రా 8 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (14)తో కలిసి బుమ్రా టాప్ ప్లేస్ సాధించాడు.
అక్షర్ పటేల్
అటు ఫీల్డింగ్ లో, ఇటు బౌలింగ్ లో అక్షర్ పటేల్ సత్తాచాటాడు. సెమీస్ లో మెరుపు ఫీల్డింగ్ తో అతను అందుకున్న క్యాచ్ లు మ్యాచ్ ను మలుపు తిప్పాయి. ఇక ఫైనల్లో పవర్ ప్లేలోనే బౌలింగ్ కు వచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అక్షర్ 7 మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీశాడు.
వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి కూడా ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా తో కలిసి అతను టాప్ లో ఉన్నాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారీ గా రన్స్ ఇచ్చిన వరుణ్.. టోర్నీ మొత్తంగా చూసుకుంటే మంచి ప్రదర్శనే చేశాడు. ఫైనల్లో కీలకమైన సీఫర్ట్ వికెట్ సాధించాడు.