IND vs NZ: ఏం బాదుడు గురూ.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత బ్యాటర్ల ఊచకోత..అభిషేక్, శాంసన్, ఇషాన్, దూబె విధ్వంసం
IND vs NZ: ప్రతి బంతిని బౌండరీ దాటించాలనే కసి.. ప్రతి బాల్ కు సిక్సర్ కొట్టాలనే పట్టుదల.. ఏమా బ్యాటింగ్? ఏమా విధ్వంసం. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా బ్యాటర్లు వేరే లెవల్లో రెచ్చిపోయారు. అహ్మదాబాద్ లో పరుగులు సునామీతో ప్రత్యర్థిని ముంచెత్తారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. అది కూడా న్యూజిలాండ్ లాంటి టఫ్ అపోనెంట్ తో మ్యాచ్. కానీ దీన్ని ఓ గల్లీ మ్యాచ్ లా మార్చేస్తూ.. కివీస్ బౌలర్లను అనామక బౌలర్లుగా మార్చేస్తూ.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించారు. సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆదివారం (మార్చి 8) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది.

సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) అదరగొట్టారు.
అభిషేక్ అదుర్స్
ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. అది ఎంత పెద్ద తప్పో కివీస్ కు త్వరగానే తెలిసొచ్చింది. ఈ టోర్నీలో తీవ్రంగా నిరాశపర్చిన అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం చెలరేగిపోయాడు. ఆఫ్ స్పిన్నర్ ట్రాప్ లో మరోసారి అభిషేక్ ను పడేయాలని చూసినా ఈ సారి మాత్రం ఈ ఓపెనర్ దొరకలేదు.
సాలిడ్ ఓపెనింగ్
సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు అభిషేక్ శర్మ తోడవడంతో ఇండియాకు సాలిడ్ ఓపెనింగ్ దక్కింది. ఈ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో పెను విధ్వంసం సృష్టించారు. సింగిల్స్ కంటే కూడా సిక్సర్లు బాదడంపైనే ఇద్దరూ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ తన కసినంతా ఫైనల్ కోసమే దాచుకున్నట్లు రెచ్చిపోయాడు. డఫీ వేసిన ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లో, ఓ సిక్సర్ బాదాడు. పవర్ ప్లే ముగిసే సరికే ఇండియా 6 ఓవర్లలో 92 పరుగులు చేసింది.
ఇషాన్ తుపాన్
18 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసిన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, శాంసన్ కలిసి బాదుడు కొనసాగించారు. 8వ ఓవర్లోనే టీమ్ స్కోరు 100 దాటింది. ఈ మ్యాచ్ లో ఇండియా 300 స్కోరు కొడుతుందేమో అనిపించింది. ఇషాన్, శాంసన్ పోటీపడి మరీ సిక్సర్లు బాదాడు. ఇషాన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయగా, శాంసన్ సెంచరీ వైపు దూసుకెళ్లాడు.
మూడు వికెట్లు
ఫుల్ జోష్ తో సాగుతున్న ఇండియన్ ఇన్నింగ్స్ కు నీషమ్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు. శాంసన్, ఇషాన్ కిషన్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ (0)ను నీషమ్ ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడటంతో ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్కోరు స్పీడ్ తగ్గిపోయింది.
దూబె విధ్వంసం
తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (13 బంతుల్లో 18) వేగంగా ఆడలేకపోయారు. స్కోరు 250 దాటడం కూడా కష్టంగా కనిపించింది. జనరల్ గా అయితే టీ20ల్లో 200 దాటడం బిగ్ స్కోరే. కానీ ఇండియాకు వచ్చిన ఓపెనింగ్ తో హైప్ పెరిగిపోయింది. అయితే ఆఖరి ఓవర్లో దూబె వీర విహారం చేశాడు. వరుసగా 4, 6, 6, 4 బాది టీమ్ స్కోరును 250 దాటించాడు. లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


