T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్ విక్టరీ.. వీళ్లే ఇండియన్ హీరోలు.. బ్యాట్‌తో విధ్వంసం.. బాల్‌తో అదుర్స్
T20 World Cup: ఇండియా సాధించింది. హిస్టరీ క్రియేట్ చేసింది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకున్న టీమ్ గా రికార్డు నమోదు చేసింది. అయితే ఈ ఇండియా విక్టరీలో హీరోలుగా నిలిచిన ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.
ఇదీ ఇండియా పవర్ అంటే.. ఇది కదా భారత క్రికెట్ సత్తా అంటే.. సొంతగడ్డపై మన క్రికెట్ టీమ్ అదరగొట్టింది. వరుసగా రెండో సారి, మొత్తంగా మూడో సారి టీ20 ప్రపంచకప్ ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించి, ఇండియా హీరోలుగా మారిన ఆటగాళ్ల గురించి తెలుసుకోండి.

సంజు శాంసన్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సంజు శాంసన్ గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు శాంసన్. ఫస్ట్ ఫైనల్ ఎలెవన్ లోనే లేని శాంసన్.. టీమ్ డిఫరెంట్ కాంబినేషన్ ప్లాన్ కారణంగా జట్టులోకి వచ్చాడు. 5 ఇన్నింగ్స్ ల్లో 321 రన్స్ తో టీమ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషంచాడు. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక రన్స్ చేసింది అతనే.
ఇషాన్ కిషన్
ఈ పొట్టి కప్ లో డైనమైట్ లా పేలాడు ఇషాన్ కిషన్. కొన్ని నెలల కిందట వరకూ అసలు ఇండియా టీ20 టీమ్ సెటప్ లోనే ఇషాన్ కు ప్లేస్ లేదు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన బ్యాటింగ్ తో తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ కు సెలెక్ట్ అయ్యాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ పై కీలక ఇన్నింగ్స్ సహా బ్యాటింగ్ లో అదరగొట్టాడు. 9 ఇన్నింగ్స్ ల్లో 317 పరుగులు చేశాడు.
శివమ్ దూబె
శివమ్ దూబెపై ప్రశంసలు కురిపించిన ఇండియన్ ఫ్యాన్ ఉండడు. ముఖ్యంగా ఫైనల్లో ఆఖరి ఓవర్లో అతని విధ్వంసం టీమ్ గెలుపుపై నమ్మకాన్ని ఇచ్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్ లో చెలరేగిన అతను 9 ఇన్నింగ్స్ ల్లో 235 పరుగులు చేశాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఆఖరి ఓవర్లో బౌలింగ్ కూడా అదరగొట్టాడు.
బుమ్రా
టీ20 ప్రపంచకప్ లో ఇండియా విజేతగా నిలిచిందంటే మరో ప్రధాన కారణం జస్ ప్రీత్ బుమ్రా. గ్రౌండ్ ఏదైనా, పిచ్ ఎలా ఉన్నా తనదైన టాప్ క్లాస్ బౌలింగ్ తో ఇండియాకు వికెట్లు అందించాడు బుమ్రా. ముఖ్యంగా సెమీస్ లో మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఇంగ్లాండ్ పై బుమ్రా బౌలింగ్ అద్భుతమే.
ఇక ఫైనల్లోనూ 4 వికెట్లతో బుమ్రా అదరగొట్టాడు. ఈ టోర్నీలో బుమ్రా 8 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (14)తో కలిసి బుమ్రా టాప్ ప్లేస్ సాధించాడు.
అక్షర్ పటేల్
అటు ఫీల్డింగ్ లో, ఇటు బౌలింగ్ లో అక్షర్ పటేల్ సత్తాచాటాడు. సెమీస్ లో మెరుపు ఫీల్డింగ్ తో అతను అందుకున్న క్యాచ్ లు మ్యాచ్ ను మలుపు తిప్పాయి. ఇక ఫైనల్లో పవర్ ప్లేలోనే బౌలింగ్ కు వచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అక్షర్ 7 మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీశాడు.
వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి కూడా ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా తో కలిసి అతను టాప్ లో ఉన్నాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారీ గా రన్స్ ఇచ్చిన వరుణ్.. టోర్నీ మొత్తంగా చూసుకుంటే మంచి ప్రదర్శనే చేశాడు. ఫైనల్లో కీలకమైన సీఫర్ట్ వికెట్ సాధించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


