మంగళూరులోని కె.ఎస్. రావు రోడ్డులో ఉన్న సిటీ సెంటర్ మాల్‌లోని కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌ను ఆహార భద్రతా శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చికెన్ దుర్వాసన వస్తూ, కుళ్ళిపోయి ఉందంటూ ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. ఔట్‌లెట్‌పై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు.
గోదాము సీల్.. ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు

తనిఖీల సమయంలో అధికారులు కేఎఫ్‌సీ కిచెన్, స్టోర్‌రూమ్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను అంగుళం అంగుళం పరిశీలించారు. అనంతరం ఆ ఔట్‌లెట్ గోదామును సీల్ చేసి, చికెన్ శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే కేఎఫ్‌సీపై తదుపరి చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు ఉంటాయని ఆహార భద్రతా శాఖ స్పష్టం చేసింది.
కేఎఫ్‌సీ వివరణ ఇదీ..
ఈ వివాదంపై కేఎఫ్‌సీ యాజమాన్యం స్పందిస్తూ ఆరోపణలను ఖండించింది. "మా సంస్థ ఆహార భద్రత, నాణ్యత, పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుంది. నెట్టింట ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు. మేము ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (FSSAI) మార్గదర్శకాలకు అనుగుణంగానే దేశంలోని గుర్తింపు పొందిన సరఫరాదారుల నుంచి నాణ్యమైన చికెన్‌ను సేకరిస్తాం. ప్రతీ రోజూ కఠినమైన నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారులకు అందిస్తాం. అధికారుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం" అని కేఎఫ్‌సీ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కిచెన్ నిర్వహణపై సందేహాలు ఉన్న వినియోగదారులు నేరుగా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు.
మైసూరు, బెంగళూరులోనూ దాడుల పరంపర
ఈ ఒక్క సంఘటన మాత్రమే కాక, కర్ణాటకవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలను ఉధృతం చేశారు. మైసూరులోని రియో మెరిడియన్ హోటల్ నుంచి 9 కేజీల కాలంచెల్లిన చికెన్, గ్రాండ్ మెర్క్యూర్ హోటల్ నుంచి 68 కేజీల మాంసం, క్యూ స్టార్ హోటల్ నుంచి 4 కేజీల పుట్టగొడుగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంజనగూడు, మైసూరు పరిసరాల్లోని రిసార్టులలో తనిఖీలు చేసి 16 కేజీల పాడైపోయిన ఆహారాన్ని పారేశారు.
స్టార్ హోటళ్లు, ఆసుపత్రి కిచెన్లలో కుళ్ళిన ఆహారం
బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి కిచెన్‌లో జరిపిన సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కాలంచెల్లిన రవ్వ, మైదా, బేకరీ ఉత్పత్తులు, పాడైపోయిన పానీపూరీ, మిశ్రమం ప్యాకెట్లతో పాటు కుళ్ళిన బ్రెడ్‌ను గుర్తించారు. అలాగే బెంగళూరులోని 'ఫోర్ సీజన్స్', 'షాంగ్రీలా' వంటి ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కుళ్ళిన మాంసం, గడువు తీరిన పాలు లభించడంతో ఆహార భద్రతా శాఖ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
{{/usCountry}}బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి కిచెన్‌లో జరిపిన సోదాల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కాలంచెల్లిన రవ్వ, మైదా, బేకరీ ఉత్పత్తులు, పాడైపోయిన పానీపూరీ, మిశ్రమం ప్యాకెట్లతో పాటు కుళ్ళిన బ్రెడ్‌ను గుర్తించారు. అలాగే బెంగళూరులోని 'ఫోర్ సీజన్స్', 'షాంగ్రీలా' వంటి ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కుళ్ళిన మాంసం, గడువు తీరిన పాలు లభించడంతో ఆహార భద్రతా శాఖ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లలో దాడులు కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ సంస్థనూ విడిచిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు.