...
...
Next Story

Kia service camp : కియా సమ్మర్​ సర్వీస్​ క్యాంప్​ షురూ.. ఫ్రీ చెకప్‌తో పాటు డిస్కౌంట్లు!

ఎండలు ముదురుతున్న వేళ, కస్టమర్ల ప్రయాణం సుఖమయంగా ఉండాలనే ఉద్దేశంతో కియా ఇండియా తన సర్వీస్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. కియాకు చెందిన అన్ని మోడళ్ల కోసం సమ్మర్ సర్వీస్ క్యాంప్‌ను తీసుకొచ్చింది. ఇందులోని కీలక విషయాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Apr 7, 2026, 12:21:02 IST
Advertisement

వేసవి కాలంలో వాహనాల పనితీరును మెరుగుపరిచేందుకు కియా ఇండియా 'నేషన్‌వైడ్ సమ్మర్ రెడీనెస్ సర్వీస్ క్యాంప్'ను ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి మే 12, 2026 వరకు వివిధ దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 497 అధీకృత వర్క్‌షాపులలో ఈ క్యాంప్​ని నిర్వహిస్తోంది. ఉచిత వెహికల్ హెల్త్ చెకప్, ఏసీ సర్వీసింగ్‌పై డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను కస్టమర్లు ఈ సందర్భంగా పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా సర్వీస్​ క్యాంప్​- ప్రాంతాల వారీగా షెడ్యూల్..

కియా సెల్టోస్​ ఎస్​యూవీ..
కియా సెల్టోస్​ ఎస్​యూవీ..

ఈ కియా మోటార్స్​ సర్వీస్ క్యాంప్ దేశవ్యాప్తంగా వివిధ దశల్లో నిర్వహిస్తున్నారు.

నార్త్, వెస్ట్, ఈస్ట్ (ఫేజ్-1): ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 12 వరకు.

ఈస్ట్ (ఫేజ్-2): ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు.

సౌత్ (దక్షిణ భారతం): మే 6 నుంచి మే 12 వరకు.

కియా సర్వీస్​ క్యాంప్- ఏయే ప్రయోజనాలు లభిస్తాయి?

ఈ క్యాంప్‌లో భాగంగా కియా కస్టమర్లకు ఈ కింది ఆఫర్లు అందుబాటులో ఉంటాయి:

ఉచిత 20-పాయింట్ చెకప్: కారు కండిషన్‌ను తెలుసుకునేందుకు ఉచితంగా 20 పాయింట్ల వెహికల్ హెల్త్ చెకప్ చేస్తారు.

ఏసీ పర్ఫార్మెన్స్ టెస్ట్: వేసవిలో ఏసీ కూలింగ్ సామర్థ్యం తగ్గకుండా ఉండేందుకు ఉచిత అసెస్‌మెంట్ నిర్వహిస్తారు.

భారీ డిస్కౌంట్లు: ఏసీ కేర్ ట్రీట్‌మెంట్స్, సమ్మర్ కార్ కేర్ ప్యాకేజీలపై 20 శాతం వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

యాక్సెసరీలపై ఆఫర్లు: ఎంపిక చేసిన జెన్యూన్ యాక్సెసరీలపై కనీసం 5 శాతం, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్​ఎస్​ఏ) ప్లాన్లపై 10 శాతం రాయితీ లభిస్తుంది.

కాంప్లిమెంటరీ సర్వీస్: సర్వీస్ క్యాంప్‌లో పాల్గొనే అన్ని వాహనాలకు ఉచితంగా టాప్ వాష్ చేసి ఇస్తారు.

సర్వీస్ సెంటర్లలో కస్టమర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా కియా నిర్వహిస్తోంది. ఇందులో 'కియా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్' మూల్యాంకనం ద్వారా మీ కారు విలువను తెలుసుకోవచ్చు. పాత కారును ఎక్స్​ఛేంజ్ చేసుకుని కొత్త కియా కారుకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నారు. క్వాలిటీ అస్యూరెన్స్ క్యాంపెయిన్స్ ద్వారా అత్యుత్తమ సర్వీస్ ప్రమాణాలను పాటించనున్నట్లు కంపెనీ తెలిపింది.

అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఎలా?

కస్టమర్లు తమకు నచ్చిన సమయంలో సర్వీస్ పొందేందుకు కింద పేర్కొన్న మార్గాల ద్వారా ముందస్తు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు:

MyKia App: మొబైల్ యాప్ ద్వారా సులభంగా బుక్ చేయవచ్చు.

ఆన్‌లైన్ పోర్టల్: కియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా.

టోల్ ఫ్రీ నంబర్: కియా కస్టమర్ కేర్ సపోర్ట్ ద్వారా.

డీలర్‌షిప్: నేరుగా మీకు దగ్గరలోని అధీకృత కియా వర్క్‌షాప్‌ను సందర్శించడం ద్వారా.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. దక్షిణ భారతదేశంలో కియా సమ్మర్ సర్వీస్ క్యాంప్ ఎప్పుడు జరుగుతుంది?

దక్షిణ భారత ప్రాంతంలో ఈ సర్వీస్ క్యాంప్ మే 6 నుంచి మే 12, 2026 వరకు నిర్వహిస్తారు.

2. ఈ సమ్మర్ క్యాంప్‌లో ఏయే సేవలు ఉచితంగా లభిస్తాయి?

కస్టమర్లకు ఉచితంగా 20-పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్, ఏసీ పర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్, కాంప్లిమెంటరీ టాప్ వాష్ లభిస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks