తెలుగు ప్రయాణికులకు శుభవార్త… ఇక విశాఖ - చర్లపల్లి మధ్య రెగ్యులర్ ట్రైన్ సర్వీస్..! ఇవిగో వివరాలు

విశాఖపట్నం - చర్లపల్లి (హైదరాబాద్) మధ్య నడిచే రైలును రెగ్యులర్  ట్రైన్ గా మార్పు చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

Published on: Mar 28, 2026, 10:36:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య నడిచే ((18527/18528) రైలును రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు చేశారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం  - విశాఖ-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు ఇక రెగ్యులర్
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం - విశాఖ-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు ఇక రెగ్యులర్

రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు…

ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి చర్లపల్లి (హైదరాబాద్), ప్రతి శనివారం చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఈ రైలు… ఇక రెగ్యులర్ గా మార్పు కానుంది. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • విశాఖపట్నం-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు ( ట్రైన్ నెంబర్ 18527) ఇకపై ప్రతి శుక్రవారం విశాఖ నుంచి చర్లపల్లికి వస్తుంది.
  • తిరుగు ప్రయాణంలో ఈ రైలు ( ట్రైన్ నెబంర్ 18528) చర్లపల్లి నుంచి విశాఖకు చేరుకుంటుంది.
  • ఈ ట్రైన్ ఏప్రిల్ 3వ తేదీన (శుక్రవారం) రోజు విశాఖలో ప్రారంభమై… మరుసటి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన (శనివారం) హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో అదే రోజు(ఏప్రిల్ 4) చర్లపల్లిలో ప్రారంభమై ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం చేరుకుంటుంది.
  • ఈ ట్రైన్ విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

ట్రైమింగ్స్ ఇలా…

విశాఖపట్నం-చర్లపల్లి (18527) ట్రైన్…. ప్రతి శుక్రవారం విశాఖలో సాయంత్రం 05.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్…. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెంబర్ 18528) ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రతి శనివారం చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.

ఈ రైళ్లలో 2ఏ, 3ఏ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ మరియు దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More