Kia EV3 : కియా ఈవీ3.. ఇది కారు మాత్రమే కాదు- రోడ్డుపై వెళ్లే 'నెట్‌ఫ్లిక్స్' సినిమా హాల్!
న్యూయార్క్ ఆటో షో 2026 వేదికగా కియా మోటార్స్ తన సరికొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఈవీ3'ని ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యాధునిక ఈ-జీఎంపీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు, ఒకే ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్ ఆటో షో 2026 వేదికగా తన సరికొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ‘కియా ఈవీ3’ని ఆవిష్కరించింది దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా. కంపెనీకి చెందిన '400వీ ఎలక్ట్రిక్ గ్లోబల్ మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్' (ఈ- జీఎంపీ)పై నిర్మితమైన ఈ కారు, అమెరికా మార్కెట్లో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. 2026 చివరి నాటికి అమెరికాలో విక్రయాలు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా దీనిని లాంచ్ చేయనున్నారు.

ఈ కియా ఈవీ3 మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి..
లైట్
విండ్
ల్యాండ్
జీటీ-లైన్
జీటీ
కియా ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- బ్యాటరీ ఆప్షన్లు, పవర్..
కియా ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో రానుంది:
58.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది కేవలం 'లైట్' వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని రేంజ్ సుమారు 354 కి.మీ.
81.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది పై వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 500 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుంది.
డ్రైవ్ సిస్టమ్: జీటీ-లైన్, జీటీ వేరియంట్లలో 'ఆల్-వీల్ డ్రైవ్' (ఏడబ్ల్యూడీ) స్టాండర్డ్‌గా రానుంది. విండ్ అండ్ ల్యాండ్ వేరియంట్లలో ఇది ఆప్షనల్‌గా ఉంటుంది.
పర్ఫార్మెన్స్: 81.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే టాప్ 'జీటీ' వేరియంట్ ఏకంగా 284 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లు 257.3 బీహెచ్పీ పవర్‌ను ఇస్తాయి. డ్రైవింగ్ అనుభూతిని మరింత ఉత్సాహంగా మార్చేందుకు ఈ ఎలక్ట్రిక్ కారులో వర్చువల్ గేర్ షిఫ్ట్, యాక్టివ్ సౌండ్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం కోసం ముందు భాగంలో మెక్‌ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్, వెనుక మల్టీ-లింక్ జియోమెట్రీని అందించారు.
కియా ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- ఇంటీరియర్, టెక్నాలజీ..
ఈ కియా ఈవీ3 లోపల అత్యాధునిక టెక్నాలజీని అమర్చారు:
ట్రినిటీ డిస్ప్లే: 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 ఇంచ్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్, మరో 12.3 ఇంచ్ డిస్ప్లేని కలిసి ఉంటాయి.
వినోదం: ఇందులో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వీడియో స్ట్రీమింగ్ సౌకర్యం ఉంది.
కనెక్టివిటీ: వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్స్-అప్ డిస్ప్లే, ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి.
మ్యూజిక్ అండ్ కెమెరా: 8-స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ (ఆప్షనల్), 360-డిగ్రీ వ్యూ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి.
కియా ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందా?
భారతదేశం వంటి ధరల పట్ల అత్యంత సున్నితంగా ఉండే మార్కెట్‌కు 'ఈవీ3' చాలా అనువైనది. ప్రస్తుతం భారత్‌లో కియాకు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తన ఎంట్రీ లెవల్ ఈవీ ఎస్‌యూవీని ఇక్కడ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది గనుక మార్కెట్లోకి వస్తే.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్‌సర్ ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. కియా ఈవీ3 (Kia EV3) గరిష్ట రేంజ్ ఎంత?
పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది.
2. ఈ కారులో అందుబాటులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఏంటి?
ఇందులో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ స్ట్రీమింగ్ సౌకర్యంతో కూడిన 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది.
3. భారత్‌లో కియా ఈవీ3 ఏ కార్లకు ప్రధాన పోటీగా నిలుస్తుంది?
ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా, ఎంజీ విండ్‌సర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


