Electric Cars : రేంజ్​లో తోపు- కంఫర్ట్​లో బెస్ట్​! త్వరలోనే ఇండియాలోకి ఈ 7 సీటర్​ ఎలక్ట్రిక్​ కార్లు..

Electric Cars Launching In 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్​లో 7-సీటర్ ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ రెండు మోడళ్లను, టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ సఫారీ ఈవీని ఈ ఏడాది లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటి రేంజ్, ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Apr 5, 2026, 12:21:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో 7 సీటర్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద కుటుంబాలకు సరిపోయేలా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ కార్లకు ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలోనూ డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు 7 సీటర్​ ఈవీలను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత రోడ్లపైకి రాబోతున్న మూడు కీలకమైన 7 సీటర్ ఎలక్ట్రిక్ వాహనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లాంచ్​కి రెడీ అవుతున్న ఎలక్ట్రిక్​ కార్లు..
లాంచ్​కి రెడీ అవుతున్న ఎలక్ట్రిక్​ కార్లు..

1. విన్‌ఫాస్ట్ ఎంపీవీ7..

వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే భారత్‌లో తన ముద్ర వేసింది. ఇప్పుడు తన మూడొవ మోడల్‌గా 'వీఎఫ్​ ఎంపీవీ7'ను తీసుకువస్తోంది.

లాంచ్ తేదీ: దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 15, 2026న అధికారికంగా లాంచ్ కానుంది.

డిజైన్ అండ్ ఫీచర్లు: లోపల ఎక్కువ స్పేస్ ఉండేలా దీనిని బాక్సీ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో సిగ్నేచర్ వీ-షేప్ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పవర్ అండ్ రేంజ్: 60.14 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు 201 బీహెచ్​పీ పవర్, 280 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

2. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్..

విన్‌ఫాస్ట్ తన 'గ్రీన్ అండ్ స్మార్ట్ మోబిలిటీ' (జీఎస్​ఎం) రైడ్-హేయింగ్ సర్వీస్‌ను కూడా భారత్‌లో ప్రవేశపెట్టనుంది. దీని కోసం ప్రత్యేకంగా ఎంపీవీ7 కమర్షియల్ వెర్షన్‌ను 'లిమో గ్రీన్' పేరుతో లాంచ్ చేయనుంది.

లక్ష్యం: ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీ ప్రధానంగా ఫ్లీట్ ఆపరేటర్ల (టాక్సీ సర్వీసెస్) కోసం వస్తోంది.

మార్పులు: మెకానిక్ అంశాలు ఎంపీవీ7 లాగే ఉన్నప్పటికీ, ఫీచర్లు, రంగుల ఎంపిక ఇందులో తక్కువగా ఉండవచ్చు.

3. టాటా సఫారీ ఈవీ..

టాటా మోటార్స్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ సఫారీ ఈవీ. ఇది ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రత్యేకతలు: ఇది టాటా నుంచి వస్తున్న మొట్టమొదటి 3-రో ఎలక్ట్రిక్ వాహనం. డిజైన్ పరంగా ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈవీ స్పెసిఫిక్ గ్రిల్, కొత్త అలాయ్ వీల్స్, ప్రీమియం ఇంటీరియర్స్‌తో వస్తుంది.

బ్యాటరీ అండ్ రేంజ్: ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారులో 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా దాదాపు 600 కి.మీ పైగా రేంజ్ ఆశించవచ్చు.

టెక్నాలజీ: ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, సీట్ వెంటిలేషన్ వంటి ఫీచర్లతో పాటు, సియెర్రా ఈవీ తరహాలో 'ట్రిపుల్ డిస్​ప్లే' సెటప్‌ను టాటా అందించే అవకాశం ఉంది. ఇది ఆర్​డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్లలో లభించనుంది.

టాటా సఫారీ ఈవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. విన్‌ఫాస్ట్ ఎంపీవీ7 భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

విన్‌ఫాస్ట్ ఎంపీవీ7 అధికారికంగా ఏప్రిల్ 15, 2026న భారత మార్కెట్​లో విడుదల కానుంది; దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

2. టాటా సఫారీ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది?

సఫారీ ఈవీ 65 kWh మరియు 75 kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది; ఇది సుమారుగా 600 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని అంచనా.

3. విన్‌ఫాస్ట్ ‘లిమో గ్రీన్’, 'ఎంపీవీ7' మధ్య ప్రధాన తేడా ఏమిటి?

ఎంపీవీ7 వ్యక్తిగత వినియోగదారుల కోసం ప్రీమియం ఫీచర్లతో వస్తుండగా, లిమో గ్రీన్ వెర్షన్‌ను ప్రత్యేకంగా టాక్సీ సర్వీసులు, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం తక్కువ ఫీచర్లతో, సరసమైన ధరలో విన్‌ఫాస్ట్ రూపొందించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More