భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో దూసుకుపోతున్న కియా సెల్టోస్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమైంది. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా కియా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించింది. టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో రాజీ పడకుండా సరికొత్త టాప్-స్పెక్ వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లగ్జరీ కార్లకు ధీటుగా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వాహన ప్రియులను ఆకట్టుకునేలా ఈ అప్‌గ్రేడ్‌ను తీసుకొచ్చింది.

భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి కియా సెల్టోస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సరికొత్త జనరేషన్ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా 10,000 యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేస్తూ ఈ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తోంది. ఇటీవల భారత్ ఎన్‌సిఎపి (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుని అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఈ విజయాల జోష్‌లోనే కంపెనీ మరింత ప్రీమియం ఫీచర్లతో కూడిన సరికొత్త వేరియంట్లను వినియోగదారుల ముందుకు తెచ్చింది.
కొత్త వేరియంట్ల ధరల వివరాలు
కియా ఇండియా సెల్టోస్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ 'జీటీఎక్స్(ఓ)' [GTX(O)], 'ఎక్స్-లైన్(ఓ)' [X-Line(O)] వేరియంట్లను లాంచ్ చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద వీటి ప్రారంభ ధరను రూ. 21.57 లక్షలుగా నిర్ణయించారు. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో మరింత ఎక్కువ ఛాయిస్‌ను కోరుకునే కస్టమర్ల కోసం ఈ వేరియంట్లను టాప్ ఎండ్‌లో ప్రవేశపెట్టారు. ఇవి కియా సుప్రసిద్ధ K3 ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి రూపొందాయి. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇవి లభిస్తాయి.
సేఫ్టీకి పెద్దపీట.. 28 ఫీచర్లతో అప్‌గ్రేడెడ్ ADAS
ఈ కొత్త వేరియంట్లలో అతిపెద్ద ఆకర్షణ కియాకు చెందిన 'ADAS F+' సూట్. భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఇందులో ఏకంగా 28 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను చేర్చారు. జంక్షన్ల వద్ద క్రాసింగ్స్, లేన్ చేంజ్ సమయంలో ప్రమాదాలను నివారించే 'ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్', అత్యవసర సమయాల్లో స్టీరింగ్‌ను నియంత్రించే 'ఎవేసివ్ స్టీరింగ్ అసిస్ట్' ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మలుపులు, స్పీడ్ జోన్లలో వేగాన్ని క్రమబద్ధీకరించే 'నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్', హైవేలపై సురక్షిత ప్రయాణానికి తోడ్పడే 'హైవే డ్రైవింగ్ అసిస్ట్' వంటి అప్‌గ్రేడెడ్ టెక్నాలజీని అందించారు.
లగ్జరీ ఫీచర్లు.. హైటెక్ కనెక్టివిటీ
{{/usCountry}}ఈ కొత్త వేరియంట్లలో అతిపెద్ద ఆకర్షణ కియాకు చెందిన 'ADAS F+' సూట్. భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఇందులో ఏకంగా 28 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను చేర్చారు. జంక్షన్ల వద్ద క్రాసింగ్స్, లేన్ చేంజ్ సమయంలో ప్రమాదాలను నివారించే 'ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్', అత్యవసర సమయాల్లో స్టీరింగ్‌ను నియంత్రించే 'ఎవేసివ్ స్టీరింగ్ అసిస్ట్' ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మలుపులు, స్పీడ్ జోన్లలో వేగాన్ని క్రమబద్ధీకరించే 'నావిగేషన్-బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్', హైవేలపై సురక్షిత ప్రయాణానికి తోడ్పడే 'హైవే డ్రైవింగ్ అసిస్ట్' వంటి అప్‌గ్రేడెడ్ టెక్నాలజీని అందించారు.
లగ్జరీ ఫీచర్లు.. హైటెక్ కనెక్టివిటీ
{{/usCountry}}టెక్నాలజీ పరంగా ఈ కార్లలో భారీ మార్పులు చేశారు. కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్ (ccNC) సిస్టమ్‌తో పాటు కియా కనెక్ట్ 2.0 వెర్షన్‌ను ఇందులో జోడించారు. ఇది 85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. కారు లాక్, అన్‌లాక్ చేయడానికి 'డిజిటల్ కీ', డ్రైవింగ్ సమాచారాన్ని విండ్‌షీల్డ్‌పైనే చూపే 'హెడ్-అప్ డిస్‌ప్లే' (HUD), క్యాబిన్ లోపల గాలి నాణ్యతను తెలిపే ఏక్యూఐ డిస్‌ప్లేతో కూడిన 'స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్' ఉన్నాయి.
భద్రత కోసం ముందు, వెనుక కెమెరాలతో కూడిన 'స్మార్ట్ డాష్‌క్యామ్', వర్షాన్ని గుర్తించే 'రైన్-సెన్సింగ్ వైపర్లు' అమర్చారు. నాలుగు పవర్ విండోస్‌కు వన్-టచ్ ఆటో అప్/డౌన్ సదుపాయంతో పాటు సేఫ్టీ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ ఇచ్చే సదుపాయం కూడా ఇందులో ఉండటం గమనార్హం.
నిపుణుల మాట
"మారుతున్న కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సెల్టోస్ నిరంతరం అప్‌గ్రేడ్ అవుతోంది. భారత మార్కెట్లో మా బ్రాండ్‌ను బలంగా నిలబెట్టడంలో ఈ కారు కీలక పాత్ర పోషించింది" అని కియా ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు.
"భారత్ ఎన్‌సిఎపిలో లభించిన 5-స్టార్ రేటింగ్ తర్వాత, ఈ సరికొత్త జీటీఎక్స్(ఓ), ఎక్స్-లైన్(ఓ) వేరియంట్లు అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, కనెక్టెడ్ ఫీచర్లు, ప్రీమియం కంఫర్ట్‌ను ఒకే ప్యాకేజీగా కస్టమర్లకు అందిస్తాయి" అని ఆయన వివరించారు.