Kia Syros EV : కియా సైరోస్​ ఈవీ కొనాలా? వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా..

Kia Syros EV price : కియా ఇండియా తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'సైరోస్ ఈవీ'ని రూ.13.50 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సింగిల్ ఛార్జ్‌పై 526 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ కారు వేరియంట్ వారీగా ధరలు, కలర్స్ సహా ఇతర విశేషాలు మీకోసం.

Published on: Jul 24, 2026, 09:58:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మరో కీలక అడుగు వేసింది. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘కియా సైరోస్ ఈవీ’ని అధికారికంగా విడుదల చేసింది. రూ. 13.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ఆకర్షణీయమైన ఆరంభ ధరతో ఈ కారును తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ సైరోస్ మోడల్‌కు పూర్తి ఎలక్ట్రిక్ రూపంగా వచ్చిన ఇప్పటికే అనేకమందిని ఆకట్టుకుంది.

కియా సైరోస్​ ఈవీ..
కియా సైరోస్​ ఈవీ..

42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే ఈ కియా సైరోస్​ ఈవీ, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రీమియం కాంపాక్ట్ ఈవీ కోరుకునే వారికి, నగర ప్రయాణాలకు ఇది ఒక అద్భుతమైన ఆల్ రౌండర్ కారుగా నిలవనుంది.

మీరు కూడా కొత్త కియా సైరోస్ ఈవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, బుకింగ్ చేసుకునే ముందు వేరియంట్ల వారీగా ధరలు, కలర్ ఆప్షన్లు, ఇతర సాంకేతిక వివరాలను ఒకసారి పరిశీలించండి.

కియా సైరోస్​ ఈవీ- వేరియంట్ల వారీగా ధరల వివరాలు..

కియా సైరోస్ ఈవీ- వేరియంట్లు, వాటి ధరలు..
42 కేడబ్ల్యూహెచ్51.4 కేడబ్ల్యూహెచ్
హెచ్​టీకేరూ. 13.50 లక్షలు-
హెచ్​టీకే ప్లస్రూ. 15 లక్షలురూ. 17 లక్షలు
హెచ్​టీఎక్స్రూ. 16 లక్షలురూ. 18 లక్షలు
హెచ్​టీఎక్స్ ప్లస్-రూ. 19.50 లక్షలు
ఎక్స్​-లైన్-రూ. 20 లక్షలు
*పైన చెప్పినవి అన్నీ ఎక్స్​షోరూం ధరలు.

కియా సైరోస్​ ఈవీ- ఆకట్టుకునే 9 రంగుల్లో అందుబాటులో..

కస్టమర్లను ఆకట్టుకునేలా కియా సైరోస్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని మొత్తం 9 ప్రీమియం రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు.

  • ఐవరీ సిల్వర్ మ్యాట్
  • ఫ్రాస్ట్ బ్లూ
  • గ్రావిటీ గ్రే
  • ప్యూటర్ ఆలివ్
  • మాగ్మా రెడ్
  • ఐవరీ సిల్వర్ గ్లోస్
  • అరోరా బ్లాక్ పెర్ల్
  • గ్లేసియర్ వైట్ పెర్ల్
  • ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్

అయితే, ఇందులో అత్యున్నత వేరియంట్ అయిన ఎక్స్-లైన్ మోడల్ మాత్రం కేవలం అరోరా బ్లాక్ పెర్ల్, ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ రంగుల్లో మాత్రమే లభిస్తుందని కియా తెలిపింది.

కియా సైరోస్​ ఈవీ- బ్యాటరీ, రేంజ్, పెర్ఫార్మెన్స్..

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కియా సంస్థ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చింది:

కియా సైరోస్​ ఈవీ- పవర్​ట్రైన్
బ్యాటరీ ప్యాక్42 కేడబ్ల్యూహెచ్51.4 కేడబ్ల్యూహెచ్
క్లైయిమ్డ్ రేంజ్ (ఎంఐడీసీ Part 1 + Part 2)443 కి.మీ526 కి.మీ
మ్యాక్స్ పవర్133 బీహెచ్​పీ169 బీహెచ్​పీ
మ్యాక్స్ టార్క్255 ఎన్​ఎం255 ఎన్​ఎం

కియా సైరోస్​ ఈవీ- ప్రధాన పోటీదారులు ఎవరు?

భారత మార్కెట్లో కాంపాక్ట్, మిడ్‌సైజ్ ఈవీ సెగ్మెంట్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కియా సైరోస్ ఈవీ నేరుగా మార్కెట్లో ఉన్న పలు దిగ్గజ కార్లకు పోటీనివ్వనుంది. ప్రధానంగా టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ, మహీంద్రా బీఈ 6లతో పాటు త్వరలో రాబోతున్న మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా మరియు విన్ ఫాస్ట్ వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లతో ఇది తలపడనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More