IPL 2026: వామ్మో-ఇన్ని రికార్డులా? క్వాలిఫయర్ 1లో మోత మోగించిన ఆర్సీబీ-టాప్ 4లో కోహ్లి-ఈ సాలా కూడా కప్ బెంగళూరుదేనా?

IPL 2026: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అదరగొట్టింది. క్వాలిఫయర్ 1లో అద్భుతమైన ఆటతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రికార్డుల మోత మోగించింది. విరాట్ కోహ్లి కూడా టాప్ లేపాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నెలకొల్పిన రికార్డులపై ఓ లుక్కేయండి.

Published on: May 27, 2026, 08:32:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026: ఇది కదా డిఫెండింగ్ ఛాంపియన్ ఆట అంటే! ఇలా కదా విజేత జట్టు ఆడాల్సింది! ఆహా.. అద్భుతం.. అమోఘం.. ఇలా ఆర్సీబీ టీమ్ గేమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పొగిడినా తక్కువే. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆర్సీబీ ప్రభంజనం గురించే మాట్లాడుకుంటోంది. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన ఆ టీమ్ ఫైనల్ చేరింది.

క్వాలిఫయర్ 1లో రికార్డుల మోత మోగించిన ఆర్సీబీ (PTI)
క్వాలిఫయర్ 1లో రికార్డుల మోత మోగించిన ఆర్సీబీ (PTI)

రికార్డుల మోత

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డుల మోత మోగించింది. గుజరాత్ టైటాన్స్ పై చెలరేగిన ఆర్సీబీ మైదానంలో ఊచకోత కోసింది. 92 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 రన్స్ చేసింది. ఛేజింగ్ లో జీటీ 162కే ఆలౌటైంది.

రికార్డులు ఇవే

  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అత్యధిక స్కోరు చేసిన టీమ్ గా ఆర్సీబీ నిలిచింది. జీటీపై ఆ టీమ్ 254/5 స్కోరు సాధించింది. జీటీ (2023లో ముంబయిపై 233/3) రికార్డు బ్రేక్ అయింది.
  • ఐపీఎల్ లో నాలుగు సార్లు ఆర్సీబీ 250కి పైగా స్కోరు చేసింది. టాప్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (6) ఉంది.
  • క్వాలిఫయర్ 1లో 33 బంతుల్లో 93 పరుగులు చేసిన రజత్ 281.81 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఐపీఎల్ లో 50 ప్లస్ స్కోరు చేసినప్పుడు ఇంత స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఫస్ట్ కెప్టెన్ అతనే.
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అత్యధిక స్కోరు చేసిన కెప్టెన్ గా వార్నర్ (2016లో గుజరాత్ లయన్స్ పై 93) సరసన చేరాడు రజత్ (93).
  • ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్ రజత్. ఈ మ్యాచ్ లో అతను 9 సిక్సర్లు కొట్టాడు. టాప్ లో శుభ్ మన్ గిల్ (2023లో ముంబయిపై 10) ఉన్నాడు.
  • ఒక టీ20 టోర్నీ సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్ గా రజత్ పాటీదార్ రికార్డు. ఈ ఐపీఎల్ 2026లో అతను 41 సిక్సర్లు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ (2023-24)లో రియాన్ పరాగ్ (40 సిక్సర్లు) రికార్డును రజత్ బ్రేక్ చేశాడు.

టాప్ 4లో కోహ్లి

విరాట్ కోహ్లి జోరు మామూలుగా లేదు. ఈ లెజెండరీ బ్యాటర్ ఐపీఎల్ 2026లో దుమ్ము లేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్- 4లోకి దూసుకొచ్చాడు విరాట్. అతను 15 ఇన్నింగ్స్ ల్లో 600 రన్స్ కొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలున్నాయి. సాయి సుదర్శన్ (652), శుభ్ మన్ గిల్ (618), క్లాసెన్ (606) వరుసగా టాప్-3లో ఉన్నారు.

ఈ సాలా కూడా

ఈ సాలా కప్ నమదే అంటూ బరిలో దిగడం, చివరకు నిరాశతో వెనుదిరగడం.. 2025కు ముందు ఆర్సీబీ పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ 2025లో ఆ టీమ్ విజేతగా నిలిచింది. ఈ సారి కూడా ఆర్సీబీ కప్ కొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని స్టాట్స్ కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

12 సార్లు

ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూసుకుంటే క్వాలిఫయర్ 1లో గెలిచిన టీమ్ ఎక్కువ సార్లు కప్ దక్కించుకుంది. 2011 నుంచి 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్ 1లో గెలిచిన టీమ్.. ఆ తర్వాత ఫైనల్లోనూ విజయదుందుభి మోగించింది. గతేడాది ఆర్సీబీ కూడా అలాగే కప్ సొంతం చేసుకుంది. 2018 నుంచి వరుసగా ఇలాగే జరుగుతుంది. ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అయితే వరుసగా రెండో సారి బెంగళూరు కప్ గెలవడం ఖాయమేనని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More