...
...
Next Story

Maharashtra TET : రేపు పరీక్ష.. ఇవాళ పేపర్ లీక్! ‘నీట్​’ గాయం మరువక ముందే మరో కలకలం..

Maharashtra TET paper leak : దేశంలో మరో పేపర్​ లీక్! ఆదివారం జరగాల్సిన మహారాష్ట్ర టెట్​ పేపర్​ లీక్ అయ్యింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్​లో పోలీసులు పలువురిని అరెస్ట్​ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్ష రద్దు అయ్యింది.

Updated on: Jun 27, 2026, 13:35:54 IST
Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్' పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతం మరువక ముందే, మహారాష్ట్రలో మరో భారీ పేపర్ లీక్ కలకలం రేపింది! ఆదివారం (జూన్ 28, 2026) జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశ్నపత్రం.. ఎగ్జామ్​కి 24 గంటల ముందే థాణే జిల్లాలో లీకైన వార్త వెలుగులోకి వచ్చింది. దీనితో అప్రమత్తమైన మహారాష్ట్ర విద్యాశాఖ.. సదరు పరీక్షను రద్దు చేసింది.

మహారాష్ట్ర టెట్​ పేపర్​ లీక్..! (Representative Image)
మహారాష్ట్ర టెట్​ పేపర్​ లీక్..! (Representative Image)

మహారాష్ట్ర టెట్​ పేపర్​ లీక్ వార్తలు కన్ఫర్మ్ అవ్వగా.. పరీక్ష రద్దుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అర్ధరాత్రి ఆపరేషన్.. దొరికిపోయిన ప్రశ్నపత్రం!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. థాణే పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర టీఈటీ ప్రశ్నపత్రం లీకైందనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం తెల్లవారుజామున జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో లీకైన ప్రశ్నపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురు అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉండటం వల్ల నిందితుల వివరాలను గోప్యంగా ఉంచారు.

విద్యాశాఖ తక్షణ నిర్ణయం..

పరీక్షా పత్రం లీకైనట్లు స్పష్టమవడంతో.. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావించిన మహారాష్ట్ర విద్యాశాఖ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, మహారాష్ట్ర టెట్ పరీక్ష తదుపరి తేదీతో కూడిన ప్రెస్ నోట్‌ను విద్యామండలి ఇంకొద్ది సేపట్లో విడుదల చేయనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే అత్యంత కీలకమైన 'టెట్' పరీక్షకు ఈ ఏడాది దాదాపు 4.28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లలో జరగాల్సిన ఈ పరీక్ష కోసం అభ్యర్థులంతా సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో ఈ లీకేజీ వార్త ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks