...
...
Next Story

Mahindra Scorpio N : 2026 మహీంద్రా స్కార్పియో ఎన్​లో కనిపించే 6 ప్రధాన మార్పులు ఇవే..

పండుగ సీజన్‌కు ముందు 2026 స్కార్పియోఎన్‌ను సరికొత్త ఫీచర్లతో తీసుకురాబోతోంది మహీంద్రా. పానోరమిక్ సన్‌రూఫ్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరాలతో రానున్న ఈ ఎస్‌యూవీ విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Aug 4, 2026, 14:02:24 IST
Advertisement

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన 'స్కార్పియో ఎన్' ఎస్‌యూవీని సరికొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని మహీంద్రా స్కార్పియో ఎన్‌ ఫేస్​లిఫ్ట్​ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఇంజిన్, బోల్డ్ డిజైన్‌ను అలాగే కొనసాగిస్తూనే.. కొనుగోలుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న పలు అధునాతన ఫీచర్లను ఇందులో జోడిస్తోంది.

మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా స్కార్పియో ఎన్

2022లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి మహీంద్రా అత్యధికంగా విక్రయించిన ఎస్‌యూవీల్లో స్కార్పియో ఎన్ ప్రధానమైనదిగా నిలిచింది. ఇప్పుడు మరింత ప్రీమియమ్‌గా, సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసిన 2026 మోడల్‌తో మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీలో రాబోతున్న 6 ప్రధాన మార్పుల వివరాలు ఇవే:

1. పెద్దదిగా 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్..

క్యాబిన్ లోపల చేసిన అతిపెద్ద మార్పులలో నూతన 10.25-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకటి. థార్ రాక్స్ మోడల్‌లో ఉన్న తరహా అత్యాధునిక ఇంటర్‌ఫేస్‌ను ఇందులో అందించబోతున్నారు. ఈ పెద్ద స్క్రీన్‌ను అమర్చడానికి వీలుగా మహీంద్రా సెంట్రల్ ఏసీ వెంట్ల పొజిషన్‌ను కూడా మార్చింది.

2. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్..

2026 మహీంద్రా స్కార్పియో ఎన్ డ్రైవర్ డిస్​ప్లే విభాగానికి 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మహీంద్రా జోడిస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో అనలాగ్ డయల్స్‌తో పాటు చిన్న ఎంఐడీ స్క్రీన్ మాత్రమే ఉంది. కానీ కొత్త డిస్​ప్లే రాకతో ఎక్స్‌యూవీ 3ఎక్స్​ఓ, ఎక్స్‌యూవీ 7ఎక్స్​ఓ, థార్ రాక్స్ సరసన ఇది చేరనుంది. ఇది ఫుల్-స్క్రీన్ నావిగేషన్‌కు మద్దతు ఇస్తూ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది.

3. లగ్జరీ లుక్ ఇచ్చే పానోరమిక్ సన్‌రూఫ్..

ఎస్​యూవీ వెలుపలి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొత్త 18-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. కొత్త వీల్స్ మినహా మిగిలిన బాడీ స్టైలింగ్ ప్రస్తుతం ఉన్న మోడల్‌లాగే ఉంటుంది.

5. ఫ్రంట్ ప్యాసింజర్లకు ఫాస్ట్ ఛార్జింగ్..

ఎస్​యూవీ క్యాబిన్ సౌకర్యాన్ని పెంచడంలో భాగంగా మహీంద్రా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికుల కోసం 65డబ్ల్యూ టైప్-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజ్‌లను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో యథావిధిగా లభిస్తుంది.

6. పార్కింగ్‌ను సులభతరం చేసే 360-డిగ్రీ కెమెరా..

మరొక ముఖ్యమైన జోడింపు 360-డిగ్రీ కెమెరా సిస్టమ్. స్కార్పియో ఎన్ పెద్ద పరిమాణం కారణంగా ఇరుకైన రోడ్లలో నడపడం, కార్ పార్కింగ్ చేయడం కొన్నిసార్లు సవాలుగా మారేది. ప్రస్తుతం కేవలం రివర్స్ పార్కింగ్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉండగా, కొత్త 360-డిగ్రీ కెమెరాతో రోజూ డ్రైవ్ చేయడం చాలా సులువవుతుంది.

ఇంజిన్ విభాగంలో మార్పుల్లేవు..

2026 మహీంద్రా స్కార్పియో ఎన్​ ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇదివరకు ఉన్న 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్ (203 పీఎస్ పవర్, 380 ఎన్​ఎం టార్క్), 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ (175 పీఎస్ పవర్, 400 ఎన్​ఎం టార్క్) కొనసాగుతాయి.

రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. డీజిల్ వెర్షన్ కొనుగోలుదారులకు 4x4 డ్రైవ్‌ట్రెయిన్ ఎంపిక కూడా లభిస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ ధర ఎంత ఉండవచ్చు?

ఈ అప్‌డేటెడ్ స్కార్పియో ఎన్ పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫీచర్లు పెరగడం వల్ల ధర కూడా స్వల్పంగా పెరగొచ్చు. దీని ప్రారంభ ఎక్స్​షోరూమ్ ధర సుమారు రూ. 13.50 లక్షల నుంచి ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో నేరుగా లేడర్-ఫ్రేమ్ రకంలో పోటీదారులు లేకపోయినా.. టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe