...
...
Next Story

Mahindra Scorpio N pickup : సన్​రూఫ్, అడాస్​ ఫీచర్లతో స్కార్పియో ఎన్ పికప్​ ట్రక్! లాంచ్ రేపే..

Mahindra Scorpio n pickup truck launch date in India : స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మహీంద్రా సంస్థ తన స్కార్పియో ఎన్ పికప్ ప్రొడక్షన్ మోడల్‌ను ముంబైలో ఆవిష్కరించనుంది. టయోటా హీలక్స్ వంటి మోడల్స్​కి గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త పికప్ ట్రక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Aug 13, 2026, 16:20:49 IST
Advertisement

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఆటోమొబైల్ మార్కెట్‌లో మరో సంచలనానికి రెడీ అవుతోంది! స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా.. టయోటా హీలక్స్ వంటి ప్రముఖ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ‘స్కార్పియో ఎన్ పికప్’ ప్రొడక్షన్ మోడల్‌ను ముంబైలో రేపు కంపెనీ ఆవిష్కరించనుంది!

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్​ ట్రక్..
మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్​ ట్రక్..

మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఇతర పికప్ ట్రక్కులతో పోలిస్తే ఈ మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్.. తక్కువ ధరకే లభించే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 2023లో కాన్సెప్ట్ రూపంలో తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్కార్పియో ఎన్ ఆధారిత పికప్.. గత కొంతకాలంగా రోడ్డు పరీక్షలను జరుపుకుంటూ మార్కెట్లోకి వచ్చేందుకు పూర్తిగా సిద్ధమైంది.

అధికారిక ఆవిష్కరణకు ముందే, గతంలో జరిగిన రోడ్డు టెస్టింగ్ సందర్భంగా ఈ ట్రక్ డిజైన్, ఇతర విశేషాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహీంద్రా ఈ సెగ్మెంట్‌లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందనే దానిపై ఆటోమొబైల్ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్- ఆకట్టుకునే డిజైన్ అంశాలు..

ఇటీవల రోడ్లపై కనిపించిన మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్ టెస్ట్ వెహికల్.. సాధారణ స్కార్పియో ఎన్​ ఎస్‌యూవీతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన ఫ్రంట్-ఎండ్ డిజైన్‌ను కలిగి ఉంది. మొదట్లో వచ్చిన ప్రోటోటైప్‌లు ఎస్‌యూవీ ఫాసియాను పోలి ఉండగా, తాజా వెహికల్ మాత్రం పెద్ద గ్రిల్, సన్నని హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.

స్కార్పియో ఎన్‌తో పోలిస్తే వెనుక వైపు ఉండే లోడ్ బెడ్ ఈ పికప్ ట్రక్కులో ప్రధాన హైలైట్‌గా మారనుంది. దీని ఖచ్చితమైన కొలతలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, మిడ్-సైజ్ పిక్అప్ సెగ్మెంట్‌లో హీలక్స్​కు దీటుగా విశాలమైన స్థలాన్ని ఇది అందించనుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్ ట్రక్- ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు..

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్ ట్రక్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇటీవల అప్‌డేట్ చేసిన స్కార్పియో ఎన్ ఎస్​యూవీ నుంచి అనేక ఫీచర్లను మహీంద్రా ఇందులో కొనసాగించనుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 540-డిగ్రీల కెమెరా సిస్టమ్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో లభించే అవకాశం ఉంది.

వీటితో పాటు లెవల్-2 అడాస్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఈ పికప్‌లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్- శక్తివంతమైన పవర్‌ట్రెయిన్..

ఈ స్కార్పియో ఎన్ పికప్ తన ఇంజిన్‌ను ఎస్‌యూవీతో పంచుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ దీనికి 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించనుంది. ఇది గరిష్టంగా 173బీహెచ్​పీ పవర్, 400 ఎన్​ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఇందులో లభించనున్నాయి. అలాగే మహీంద్రాకు చెందిన ప్రత్యేకమైన '4XPLOR' ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఈ పికకు అద్భుతమైన ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని చేకూర్చనుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ పికప్- ధర అత్యంత కీలకం..

స్పెసిఫికేషన్లతో పాటు ఈ వాహనాన్ని మార్కెట్లో మహీంద్రా ఏ ధర వద్ద పొజిషన్ చేస్తుందనేది అత్యంత కీలకంగా మారనుంది. రేపు జరగనున్న అధికారిక ఆవిష్కరణలో దీని ఫైనల్ డిజైన్, ఫీచర్లు, వేరియంట్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe