భారత వాహన రంగంలో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఆటోమొబైల్ సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కంపెనీకి చెందిన ప్రీమియం లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ’.. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్‌సీఏపీ) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఈ మోడల్ ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కొత్త కార్లు కొనుగోలు చేసేవారు మైలేజ్, డిజైన్‌తో పాటు భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చిన 'భారత్ ఎన్‌సీఏపీ' టెస్టింగ్‌లో మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మెరుగైన స్కోరు సాధించడం విశేషం.
జులై 2026లో నిర్వహించిన ఈ క్రాష్ టెస్ట్ వివరాలను సంస్థ తాజాగా, అధికారికంగా పంచుకుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ సేఫ్టీ రేటింగ్- పెద్దల రక్షణలో ఇలా..
భారత్ ఎన్‌సీఏపీ నిర్వహించిన అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ మొత్తం 32 పాయింట్లకు గాను 30.76 పాయింట్లు దక్కించుకుంది. 2,059 కేజీల బరువున్న ఈ ఎస్‌యూవీ ఏఎక్స్7 డీజెల్ 2WD 7-సీటర్, ఏఎక్స్7ఎల్ డీజెల్ 4WD 7-సీటర్ ఆటోమేటిక్ వేరియంట్లను ఈ పరీక్షల కోసం వినియోగించారు.
ముందు భాగం నుంచి బలంగా ఢీకొట్టే 'ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్' పరీక్షలో 16 పాయింట్లకు 14.76 పాయింట్లు రాగా, ప్రక్క భాగం నుంచి ఢీకొట్టే 'సైడ్ మూవబుల్ డీఫార్మబుల్ బారియర్' టెస్ట్‌లో ఏకంగా పూర్తి 16 పాయింట్లు సాధించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ ఈ వాహనం సురక్షితమైన ఫలితాన్ని రాబట్టి ప్రయాణికుల ప్రాణాలకు బలమైన రక్షణ ఇస్తుందని నిరూపించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ సేఫ్టీ రేటింగ్- చిన్నారుల భద్రతలో ఇలా..
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ ఎస్‌యూవీ 49 పాయింట్లకు గాను 44.97 పాయింట్లు సాధించింది. ఇందులో డైనమిక్ అసెస్మెంట్లో 24 పాయింట్లకు 23.97, సీఆర్ఎస్ ఇన్‌స్టాలేషన్‌లో పూర్తి 12 పాయింట్లు, వెహికల్ అసెస్మెంట్లో 13 పాయింట్లకు 9 పాయింట్లు లభించాయి.
{{/usCountry}}చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఈ ఎస్‌యూవీ 49 పాయింట్లకు గాను 44.97 పాయింట్లు సాధించింది. ఇందులో డైనమిక్ అసెస్మెంట్లో 24 పాయింట్లకు 23.97, సీఆర్ఎస్ ఇన్‌స్టాలేషన్‌లో పూర్తి 12 పాయింట్లు, వెహికల్ అసెస్మెంట్లో 13 పాయింట్లకు 9 పాయింట్లు లభించాయి.
{{/usCountry}}18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్న పిల్లల డమ్మీలను వెనుక వైపు ముఖం ఉండేలా అమర్చి, బ్రిటాక్స్ రోమర్ డ్యూయల్‌ఫిక్స్ ప్రో ఎం ఐ-సైజ్ సపోర్ట్‌తో ఈ పరీక్షలు జరిపారు. 18 నెలల చిన్నారి డమ్మీకి ఫ్రంటల్ టెస్ట్‌లో 7.97/8, సైడ్ టెస్ట్‌లో 4/4 పాయింట్లు లభించగా, 3 ఏళ్ల చిన్నారి డమ్మీకి ఫ్రంటల్, సైడ్ టెస్టులు రెండింటిలోనూ పూర్తి పాయింట్లు లభించడం విశేషం.
అన్ని వేరియంట్లలో ప్రమాణికంగా సేఫ్టీ ఫీచర్లు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓలోని అన్ని వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, పాదచారుల రక్షణ వ్యవస్థ, సీట్‌బెల్ట్ రిమైండర్‌లను సంస్థ ప్రామాణికంగా అందిస్తోంది.
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ మోడల్‌కు చెందిన పెట్రోల్, డీజెల్ ఇంజిన్ లైనప్‌లోని ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7, ఏఎక్స్7టీ, ఏఎక్స్7ఎల్ వేరియంట్లు అన్నింటికి ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుంది. 6-సీటర్, 7-సీటర్ సీటింగ్ ఆప్షన్లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ మోడళ్లకు కూడా ఈ రక్షణ ప్రామాణికంగా లభిస్తుంది.