భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటైన మహీంద్రా ఎక్స్‌యూవీ700కి సంస్థ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అప్డేటెడ్ వర్షెన్‌కి సంస్థ ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ అనే పేరు పెట్టింది. వచ్చే ఏడాది జనవరి 5న ఈ మోడల్ లాంచ్ అవుతుంది. కాగా డిసెంబర్ 15 నుంచే ఈ మోడల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది.

మహీంద్రా గతంలో తమ ఎక్స్‌యూవీ30 ను ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓగా రీబ్యాడ్జ్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలోనే, ఇప్పుడు ఎక్స్‌యూవీ700ను ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓగా మార్చింది. రాబోయే ఈ మోడల్ ప్రస్తుత ఎక్స్‌యూవీ700తో పోలిస్తే పూర్తిగా సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.
మీరు కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు తప్పకుండా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ- ప్రీ బుకింగ్స్ వివరాలు..
మహీంద్రా డిసెంబర్ 15, 2025న మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు రూ. 21,000 టోకెన్ మొత్తంతో ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.
ప్రీ బుకింగ్ సమయంలో, కస్టమర్‌లు తమకు నచ్చిన డీలర్‌షిప్, ఇంధన రకం, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ కోసం మహీంద్రా డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రీ బుకింగ్‌లు చేసుకోవచ్చు.
| మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ- బుకింగ్స్ వివరాలు | |
|---|---|
| ప్రీ బుకింగ్ ప్రారంభం | డిసెంబర్ 15, 2025 |
| ప్రీ బుకింగ్ అమౌంట్ | రూ. 21,000 |
| లాంచ్ డేట్ | జనవరి 5, 2026 |
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ- డిజైన్‌లో కీలక మార్పులు..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎక్స్టీరియర్లో ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఇందులో కొత్తగా చేరే ఫీచర్లు:
{{/usCountry}}మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎక్స్టీరియర్లో ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఇందులో కొత్తగా చేరే ఫీచర్లు:
{{/usCountry}}హెడ్‌ల్యాంప్‌లు: కొత్త డ్యూయల్ పాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వాటికి అనుబంధంగా ఇన్వర్టెడ్ 'L' ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉంటాయి.
టెయిల్‌లైట్లు: మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ మోడల్ తరహాలో కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు రానున్నాయి. ఎక్స్‌ఈవీ 9ఎస్ మాదిరిగానే ఈ ఎస్‌యూవీ కూడా కనెక్టెడ్ టెయిల్‌లైట్ల ట్రెండ్‌ను పాటించకపోవచ్చు.
సిల్వర్ స్లాట్‌లతో కూడిన కొత్త బ్లాక్డ్-అవుట్ రేడియేటర్ గ్రిల్, సరికొత్త బంపర్‌లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో ఆశించవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ- ప్రీమియం ఇంటీరియర్..
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎస్‌యూవీ క్యాబిన్ లోపల కూడా పూర్తిగా సరికొత్త డిజైన్ లేఅవుట్‌తో రానుంది. ఇందులో ఉపయోగించే మెటీరియల్స్ కూడా మరింత నాణ్యంగా ఉండే అవకాశం ఉంది.
ట్రిపుల్ స్క్రీన్ సెటప్: క్యాబిన్ లోపల ప్రధాన హైలైట్ ఎక్స్‌ఈవీ 9ఎస్ మాదిరిగానే ఉండే ట్రిపుల్-స్క్రీన్ సెటప్. (ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ స్క్రీన్‌తో వస్తుంది).
సౌకర్యాలు: డాష్‌బోర్డ్‌పై సాఫ్ట్-టచ్ ఎలిమెంట్స్, డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన స్లైడింగ్ సెకండ్-రో సీట్లు, అన్ని సీట్లలో అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్‌లు వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ- ఇంజిన్‌లో మార్పులు లేనట్టే!
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓలో ఇంజిన్ ఆప్షన్స్ మాత్రం పాతవే ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం ఉన్న 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లే కొనసాగవచ్చు.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కూడా సిక్స్-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓలో కూడా అదే ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కొనసాగే అవకాశం ఉంది.