...
...
Next Story

Maruti Suzuki Baleno facelift : ఇంకొన్ని రోజుల్లో బలెనో ఫేస్​లిఫ్ట్​ లాంచ్- టాప్ 3 హైలైట్స్..

Maruti Suzuki Baleno : మారుతీ సుజుకీ ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలెనో ఫేస్‌లిఫ్ట్‌ను సెప్టెంబర్ 5న లాంచ్ చేయనుంది. సరికొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లతో రానున్న ఈ కారుపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 14, 2026, 16:20:51 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతీ సుజుకీ బలెనో ముందు వరుసలో ఉంటుంది. నెక్సా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతున్న ఈ కారు.. హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడల్స్​కి గట్టి పోటీ ఇస్తోంది. అయితే 2022 తర్వాత బలెనోలో అత్యంత కీలకమైన అప్‌డేట్‌తో సరికొత్త మోడల్‌ను తీసుకురావడానికి మారుతీ సుజుకీ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ బలెనో ఫేస్‌లిఫ్ట్‌పై ఆటోమొబైల్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మారుతీ సుజుకీ బలెనో ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తోంది..
మారుతీ సుజుకీ బలెనో ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తోంది..

గత కొన్ని నెలలుగా భారత రోడ్లపై ఈ మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ దశలో పలుమార్లు కనిపించింది. ఇది పూర్తిగా కొత్త జనరేషన్ మోడలా లేక అప్‌డేటెడ్ వెర్షనా అనే దానిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ టెస్టింగ్ కారును బట్టి చూస్తే ఇది ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గానే రానుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ బలెనో ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో రానున్న ప్రధాన మార్పులు ఇవే..

1. సరికొత్త డిజైన్ రూపురేఖలు

బలెనో ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త డిజైన్ కనిపించనుంది. గ్రిల్ మరింత స్లీక్‌గా మారే అవకాశం ఉంది. హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ సన్నని క్రోమ్ స్ట్రిప్ రానుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రస్తుత మోడల్ మాగే ఉండనున్నాయి. వెనుక భాగంలో కూడా కొన్ని స్వల్ప మార్పులు చేశారు. కొత్తగా డిజైన్ చేసిన 16 అంగుళాల అలాయ్ వీల్స్‌తో ఈ కారు రోడ్డెక్కనుంది.

2. ఇంటీరియర్, కలర్ థీమ్‌లో మార్పులు

3. శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు

ఇంజిన్ పరంగా చూస్తే, ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఇది 88 బీహెచ్‌పీ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఏఎంటీ ఆప్షన్లతో పాటు మాన్యువల్ యూనిట్‌తో కూడిన సీఎన్జీ వేరియంట్ కూడా లభిస్తుంది. అయితే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, కొత్త బ్రెజ్జాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఈ బలెనో ఫేస్‌లిఫ్ట్‌కు కూడా సంస్థ అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

సెప్టెంబర్​ 5 లాంచ్​తో ఈ మారుతీ సుజుకీ బలెనో ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన ధర, ఫీచర్లు వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలుస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks