భారతీయ మార్కెట్లో కొద్ది నెలల క్రితమే డిస్కంటిన్యూ చేసిన మారుతీ సుజుకీ సియాజ్ కారు క్రాష్ టెస్ట్ ఫలితాలను గ్లోబల్ ఎన్‌సీఏపీ తాజాగా విడుదల చేసింది. మన దేశంలో తయారైన ఈ సెడాన్ భద్రత విషయంలో షాకింగ్ ఫలితాలను నమోదు చేసింది. పెద్దల రక్షణ విషయంలో కేవలం 1-స్టార్ రేటింగ్‌ను మాత్రమే సాధించిన సియాజ్, పిల్లల భద్రత విషయంలో 3-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.
ప్రస్తుతం షోరూమ్‌లలో ఈ సెడాన్ అమ్మకానికి లేకపోయినా, గత కొన్నేళ్లుగా సాధించిన రికార్డు విక్రయాల వల్ల ఇప్పటికీ భారత రోడ్లపై వేల సంఖ్యలో సియాజ్ కార్లు తిరుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది! ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ కారు వాడుతున్న వారు, పాత సియాజ్ కారును కొనాలనుకునే వారు దీని సేఫ్టీ రేటింగ్‌ను గమనించడం చాలా ముఖ్యం.
మారుతీ సుజుకీ సియాజ్ క్రాష్ టెస్ట్- పూర్తి వివరాలు..
2025 గ్లోబల్ ఎన్‌సీఏపీ ప్రకారం, పెద్దల రక్షణ విభాగంలో సియాజ్ 34 పాయింట్లకు గాను 20.86 పాయింట్లు సాధించింది. అదేవిధంగా పిల్లల రక్షణ విభాగంలో 49 పాయింట్లకు గాను 28.57 పాయింట్లు పొందింది.
సుమారు 1,260 కిలోల బరువున్న కారును ఈ పరీక్షల కోసం వినియోగించారు.
ముందు వైపు నుంచి జరిగిన క్రాష్ టెస్ట్‌లో డ్రైవర్, పక్కన కూర్చున్న ప్రయాణికుడి తల, మెడకు మంచి రక్షణే లభించింది. అయితే, డ్రైవర్ ఛాతీ భాగంలో రక్షణ నామమాత్రంగానే ఉందని, మోకాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా కారు బాడీ షెల్, ఫుట్‌వెల్ ఏరియా అస్థిరంగా ఉన్నాయని గ్లోబల్ ఎన్‌సీఏపీ తేల్చింది.
అందుకే దీనికి అడల్ట్ సేఫ్టీలో 1-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది!
{{/usCountry}}అందుకే దీనికి అడల్ట్ సేఫ్టీలో 1-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది!
{{/usCountry}}సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో తల, తుంటి భాగానికి రక్షణ బాగున్నప్పటికీ, ఛాతీ భాగంలో రక్షణ చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మారుతీ సుజుకీ సియాజ్‌కి సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల 'సైడ్ పోల్ టెస్ట్' నిర్వహించలేదు.
మారుతీ సుజుకీ సియాజ్ క్రాష్ టెస్ట్- ఫీచర్ల పరిస్థితి ఏంటి?
మారుతీ సుజుకీ సియాజ్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు ప్రామాణికంగా ఉన్నాయని గ్లోబల్ ఎన్‌సీఏపీ ధృవీకరించింది. అయితే సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోవడం, ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు (అడాస్) లోపించడం వంటివి ఈ కారు భద్రత రేటింగ్‌ను తగ్గించాయి.
మారుతీ సుజుకీ సియాజ్ క్రాష్ టెస్ట్- పిల్లల భద్రతలో..
పిల్లల రక్షణ విషయంలో సియాజ్ 3-స్టార్ రేటింగ్‌తో కొంత మెరుగ్గా నిలిచింది. ఐసోఫిక్స్ మౌంట్‌ల సాయంతో 18 నెలలు, 3 ఏళ్ల పిల్లల బొమ్మలపై చేసిన పరీక్షల్లో మంచి రక్షణ ఉన్నట్లు తేలింది. తల భాగానికి ఎటువంటి దెబ్బలు తగలలేదు. కానీ వెనుక సీటు మధ్య భాగంలో సరైన బెల్ట్ సౌకర్యం లేకపోవడం, ఫ్రంట్ ప్యాసింజర్ సీటు వద్ద ఐసోఫిక్స్ లేకపోవడం వంటి లోపాలను నివేదిక ఎత్తిచూపింది.
మారుతీ సుజుకీ సెలేరియోకు 3 స్టార్ రేటింగ్..
భారతీయ కార్ల మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతీ సుజుకీ సెలెరియోపై తాజాగా గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగింది. ఈ పరీక్షల్లో సెలెరియో మిశ్రమ ఫలితాలను సాధించింది. కారులో భద్రతా ప్రమాణాలను పెంచినప్పటికీ, గ్లోబల్ ఎన్సీఏపీకి చెందిన కఠినమైన కొత్త నిబంధనల ప్రకారం ఈ కారుకు 3 స్టార్ రేటింగ్ దక్కింది.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.