Maruti Suzuki e Vitara ఆవిష్కరణ- రేంజ్, ఫీచర్స్ ఇవే..
Maruti Suzuki e Vitara ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సంస్థ ఆవిష్కరించింది. 2026 జనవరిలో ఇది లాంచ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీ రేంజ్, ఫీచర్స్, సేఫ్టీ రేటింగ్ వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
భారతదేశంలో మారుతీ సుజుకీ తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను మరోసారి అధికారికంగా ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 2026లో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త మోడల్‌తో మారుతీ సుజుకీ మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి అడుగుపెడుతూ, తన ఎలక్ట్రిఫికేషన్ వ్యూహంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో ఈవీఎక్స్ కాన్సెప్ట్ రూపంలో తొలిసారిగా ప్రదర్శనకు వచ్చిన ఈ ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఆ తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పూర్తి ఉత్పత్తి రూపంలో ఆవిష్కృతమైంది. ప్రత్యేకంగా ఈవీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన మారుతీ మొట్టమొదటి మాస్-మార్కెట్ బ్యాటరీ ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఇదే కావడం విశేషం.
మారుతీ సుజుకీ ఈ- విటారా: ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు..
ఈ మారుతీ సుజుకీ ఈ-విటారా కొత్త HEARTECT-e ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. కేవలం ఈవీల కోసం రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ ఫ్లాట్-ఫ్లోర్ డిజైన్‌ను, బలమైన హై-వోల్టేజ్ సేఫ్టీ స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో స్థానం పొందింది.
బ్యాటరీ ఆప్షన్స్: ఈ-విటారా రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, అలాగే 2డబ్ల్యూడీ (టూ-వీల్ డ్రైవ్), 4డబ్ల్యూడీ (ఫోర్-వీల్ డ్రైవ్) వేరియంట్లలో లభించనుంది.
మైలేజ్: టాప్-స్పెక్ వేరియంట్‌లో ఒకే ఛార్జ్‌పై 543 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని మారుతీ సుజుకీ పేర్కొంది.
కలర్స్: ఈ-విటారాను నాలుగు డ్యూయల్-టోన్‌తో పాటు మొత్తం 10 రంగుల ఆప్షన్స్ కొనుగోలు చేయవచ్చు.
మారుతీ సుజుకీ ఈ- విటారా: బ్యాటరీ, రేంజ్, పనితీరు..
ఈ-విటారాను 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ ఎల్పీఎఫ్ బ్యాటరీ ప్యాక్‌లతో విక్రయిస్తోంది మారుతీ సుజుకీ.
2డబ్ల్యూడీ (49 కేడబ్ల్యూహెచ్)- 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.. 142 బీహెచ్‌పీ పవర్‌ని, 189 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 344 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది.
2డబ్ల్యూడీ (61 కేడబ్ల్యూహెచ్)- 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.. 172 బీహెచ్‌పీ పవర్, 189 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని రేంజ్ 543 కి.మీ.
4డబ్ల్యూడీ (61 కేడబ్ల్యూహెచ్)- 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.. 172 బీహెచ్‌పీ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. రేంజ్ 543 కి.మీ.
2డబ్ల్యూడీ 49 కేడబ్ల్యూహెచ్ వెర్షన్: ఇది కేవలం 2డబ్ల్యూడీ (టూ-వీల్ డ్రైవ్) సెటప్‌లో మాత్రమే లభిస్తుంది.
61 కేడబ్ల్యూహెచ్ వెర్షన్: పెద్ద బ్యాటరీ యూనిట్ 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ (ఫోర్-వీల్ డ్రైవ్) వేరియంట్లలో లభిస్తుంది.
ALLGRIP-e 4డబ్ల్యూడీ సిస్టమ్
61 కేడబ్ల్యూహెచ్ వేరియంట్లలో సుజుకీ ALLGRIP-e ఎలక్ట్రిక్ 4డబ్ల్యూడీ సిస్టమ్‌ను తొలిసారిగా పరిచయం చేస్తున్నారు. ఈ సిస్టమ్‌లో ముందు, వెనుక భాగంలో స్వతంత్ర ఈయాక్సిల్ మోటార్లు ఉంటాయి. ఇది ఆఫ్-రోడ్ పనితీరును మెరుగుపరచడానికి "ట్రైల్ మోడ్"ను కూడా కలిగి ఉంది.
మారుతీ సుజుకీ ఈ- విటారా: ఇంటీరియర్, టెక్నాలజీ..
ఈ-విటారా లోపలి భాగంలో చదరపు ఆకారపు ఎయిర్ వెంట్‌లు, డ్యూయల్-స్క్రీన్ డిస్‌ప్లే సెటప్‌తో కూడిన క్లీన్ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది.
డ్యూయల్-స్క్రీన్: ఇందులో 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ప్రామాణికంగా లభిస్తాయి.
డ్రైవర్ ఫీచర్లు: డ్రైవర్‌కు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 10-వే పవర్-అడ్జస్టబుల్ సీటు, సుజుకీ కనెక్ట్ ద్వారా అనేక కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఈపీబీ, కనెక్టెడ్ కార్ ఫంక్షన్లు వంటి అనేక సౌకర్యవంతమైన ఫీచర్లను ఈ ఎస్‌యూవీలో అందించారు.
మారుతీ సుజుకీ ఈ- విటారా: భద్రత..
ఈ-విటారా మారుతీ మోడళ్లలో మొదటిసారిగా లెవల్-2 ADAS సూట్‌ను అందిస్తోంది.
అడాస్ ఫీచర్లు: లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి డ్రైవర్ సహాయక వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
ప్రామాణిక భద్రత: ప్రామాణిక భద్రతా పరికరాల్లో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఈఎస్సీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, ముందు - వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
భారత్ ఎన్సీఏపీ రేటింగ్: ఈ ఎస్‌యూవీ ఇటీవల జరిగిన భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.
మారుతీ సుజుకీ ఈ- విటారా : లాంచ్, బుకింగ్‌లు..
జనవరి 2026లో మారుతీ సుజుకీ ఈ-విటారాను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అదే సమయంలో కారు అధికారిక ధరలను వెల్లడించనున్నారు. బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయి, అయితే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


