Maruti Suzuki AI Technology : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. భవిష్యత్తు మార్కెట్‌ను శాసించేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న పోటీని తట్టుకోవడంతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సరికొత్త వాహనాలను మరింత వేగంగా, అత్యంత సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి కంపెనీ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను రంగంలోకి దించుతోంది.

రాబోయే కొద్ది సంవత్సరాల్లో తన ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) శ్రేణిని భారీగా విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న మారుతీ సుజుకీకి ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ ఎంతో కీలకం కానుంది.
ఏఐ సాంకేతికతతో తగ్గనున్న కార్ల తయారీ సమయం..!
సాధారణంగా ఒక సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురావడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో డిజైన్ రూపకల్పన, టెస్టింగ్, వ్యాలిడేషన్, ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి ఎన్నో కీలక దశలు ఉంటాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ సంస్థ ఒక కొత్త మోడల్ కారును పూర్తిగా అభివృద్ధి చేయడానికి దాదాపు 48 నెలల (నాలుగేళ్ల) సమయం తీసుకుంటోంది.
అయితే, ఇకపై ఈ సమయాన్ని 36 నెలలకు (మూడేళ్లకు) తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ వంటి డిజిటల్ టెక్నాలజీలను ఇంజనీర్లు ఉపయోగించనున్నారు. ఈ ఆధునిక సాధనాల సహాయంతో కారు అసలు నమూనాను తయారు చేయడానికి ముందే.. కారులోని విడిభాగాలను కంప్యూటర్ స్క్రీన్‌పైనే వర్చువల్‌గా టెస్ట్ చేసి వెరిఫై చేయవచ్చు. దీనివల్ల కారులో ఉండబోయే లోపాలను ముందే గుర్తించి, సరిచేసే అవకాశం లభిస్తుంది. ఫలితంగా సమయంతో పాటు కంపెనీకి అయ్యే ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.
క్యూలో 9 కొత్త కార్లు.. ఎస్‌యూవీ, ఈవీలపైనే ఫోకస్!
రాబోయే మూడు సంవత్సరాల్లో సరికొత్త మోడళ్లతో మార్కెట్‌పై పట్టు సాధించాలని మారుతీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 9 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ అప్‌కమింగ్ లైనప్‌లో ఎస్‌యూవీల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. రాబోయే ఈ కార్లు పెట్రోల్, ఫ్లెక్స్-ఫ్యూయల్, హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి.
{{/usCountry}}రాబోయే మూడు సంవత్సరాల్లో సరికొత్త మోడళ్లతో మార్కెట్‌పై పట్టు సాధించాలని మారుతీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 9 సరికొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ అప్‌కమింగ్ లైనప్‌లో ఎస్‌యూవీల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. రాబోయే ఈ కార్లు పెట్రోల్, ఫ్లెక్స్-ఫ్యూయల్, హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి.
{{/usCountry}}ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, విక్టోరిస్ వంటి పాపులర్ మోడళ్లు యూటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇప్పుడు రాబోయే సరికొత్త లాంచ్‌లు ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ పరిధిని మరింత విస్తరించనున్నాయి.
సప్లయర్లతో కలిసి ముందస్తు ప్లానింగ్..
కార్ల తయారీ వేగాన్ని పెంచడానికి మారుతీ సుజుకీ తన వ్యూహంలో మరో కీలక మార్పు చేసింది. ఇకపై కారు విడిభాగాలను సరఫరా చేసే సప్లయర్లను తయారీ ప్రక్రియ ప్రారంభంలోనే భాగస్వాములను చేయనుంది.
గతంలో కారు డిజైన్ పూర్తిగా పూర్తయిన తర్వాతే విడిభాగాల తయారీని ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా.. కారు డిజైన్ అవుతున్నప్పుడే దానికి సమాంతరంగా కాంపోనెంట్ ఇంజనీరింగ్, టూలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిపరేషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి పనులన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల అనవసరపు ఆలస్యం తగ్గి, పనిలో మరింత వేగం పెరుగుతుంది.
80 శాతానికి పైగా మేడ్ ఇన్ ఇండియా విడిభాగాలే!
భవిష్యత్తులో రాబోయే తన కొత్త కార్లలో 80 శాతానికి పైగా స్థానిక విడిభాగాలనే ఉపయోగించాలని మారుతీ సుజుకీ నిర్ణయించింది.
దేశీయంగా లభించే విడిభాగాలను ఎక్కువగా వాడటం వల్ల కార్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, సరఫరా గొలుసు స్థిరంగా ఉంటుంది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివల్ల అటు దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఇటు ఎగుమతి మార్కెట్లలోనూ డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తిని తక్షణమే పెంచడం కంపెనీకి చాలా సులువవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో మారుతీ సుజుకీ అమ్మకాలు అద్భుతంగా సాగుతున్నాయి. ఇటీవలే కంపెనీ ఒకే నెలలో ఏకంగా 1.90 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే కార్ల ఎగుమతులు కూడా భారీగా వృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో, ఏఐ టెక్నాలజీ, సప్లయర్ల భాగస్వామ్యం, లోకలైజేషన్ వంటి సరికొత్త మార్పులతో మారుతీ సుజుకీ మరింత వేగంగా, తక్కువ ఖర్చుతోనే కొత్త తరం ఎస్‌యూవీ, ఈవీ కార్లను కస్టమర్ల ముందుకు తీసుకురావడానికి సర్వసన్నద్ధమవుతోంది.