Mileage cars : ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే.. భారీగా డబ్బులు ఆదా!

కొత్త కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అధిక మైలేజీ ఇచ్చే మోడల్స్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో టాప్​-5 అధిక మైలేజ్​ ఇచ్చే కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. వీటి వల్ల మీ ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి.

Published on: Feb 10, 2026, 06:45:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎవరు ఏ కారు కొన్నా, కొనాలని ప్లాన్​ చేస్తున్నా ముందుగా వినిపించే ప్రశ్న.. “ఎంత మైలేజీ​ ఇస్తుంది?” అని. సేఫ్టీ- ఆధునిక సాంకేతిక ముఖ్యమే అయినప్పటికీ ఒక కారు కొనేందుకు భారతీయులు ఇప్పటికీ చూస్తున్న మొదటి విషయం మైలేజీ అని అనడంలో సందేహమే లేదు​. మరీ ముఖ్యంగా ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉంటున్న నేటి కాలంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే వాహనాలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం లభిస్తున్న టాప్​- 5 హై మైలేజీ​ కార్ల (పెట్రోల్​/ హైబ్రిడ్​) వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ విక్టోరిస్​..
మారుతీ సుజుకీ విక్టోరిస్​..

మైలేజ్​లో ఈ కార్లు తోపు..

1. మారుతీ సుజుకీ విక్టోరిస్

ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా మారుతీ సుజుకీ విక్టోరిస్ రికార్డు సృష్టించింది! ఇది ఒక మిడ్-సైజ్ ఎస్​యూవీ అయినప్పటికీ, దీనిలోని 'స్ట్రాంగ్ హైబ్రిడ్' టెక్నాలజీ వల్ల అద్భుతమైన మైలేజీ లభిస్తోంది.

ఏఆర్​ఏఐ మైలేజీ: 28.65 కేఎంపీఎల్​

ప్రత్యేకత: ఇది గ్రాండ్ విటారా కంటే మెరుగైన మైలేజీని అందిస్తూ, దేశంలోనే నంబర్ 1 పొదుపైన ఎస్​యూవీగా నిలిచింది.

2. టయోటా హైరైడర్ / మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా

ఈ రెండు కార్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. వీటిలోని 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ సిటీ ట్రాఫిక్‌లో కూడా మంచి మైలేజీని ఇస్తుంది.

ఏఆర్​ఏఐ మైలేజీ: 27.97 కేఎంపీఎల్​

ప్రత్యేకత: ఈ హైబ్రిడ్ కార్లు సెల్ఫ్-చార్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి, కాబట్టి విడిగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.

3. హోండా సిటీ ఈ:హెచ్​ఈవీ (హైబ్రిడ్​)

సెడాన్ కార్లలో రాజీలేని మైలేజీ కావాలనుకునే వారికి హోండా సిటీ హైబ్రిడ్ ఉత్తమ ఎంపిక. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం.

ఏఆర్​ఏఐ మైలేజీ: 27.26 కేఎంపీఎల్​

ప్రత్యేకత: ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్ కారు ఇదే.

4. మారుతీ సుజుకీ సెలెరియో

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారు కోసం చూస్తుంటే సెలెరియో మొదటి వరుసలో ఉంటుంది. ఈ చిన్న కారుకు ప్లస్​ పాయింట్​ దీని తక్కువ బరువు (810-835 కేజీలు).

ఏఆర్​ఏఐ మైలేజీ: 26.68 కేఎంపీఎల్​ (ఏఎంటీ వెర్షన్)

ప్రత్యేకత: నాన్-హైబ్రిడ్ కార్లలో ఇదే బెస్ట్ మైలేజీ కార్.

5. మారుతీ సుజుకీ స్విఫ్ట్

కొత్త తరం జెడ్​-సిరీస్ ఇంజిన్‌తో వస్తున్న మారుతీ సుజుకీ స్విఫ్ట్, స్టైల్‌తో పాటు పొదుపును కూడా అందిస్తోంది. డిజైర్ కంటే తక్కువ బరువు ఉండటం వల్ల స్విఫ్ట్ మైలేజీలో పైచేయి సాధించింది.

ఏఆర్​ఏఐ మైలేజీ: 25.75 కేఎంపీఎల్​

ప్రత్యేకత: యువతకు ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్ కావడమే కాకుండా, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ.

పైన పేర్కొన్న మైలేజీ గణాంకాలు ఏఆర్​ఏఐ (ఆటోమోటివ్​ రీసెర్చ్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా) ద్వారా ల్యాబ్ పరిస్థితుల్లో పరీక్షించినవి. రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్, మీ డ్రైవింగ్ శైలిని బట్టి రియల్​ టైమ్​ మైలేజీ కొంత మారే అవకాశం ఉంది.

పైగా పైన చెప్పినవి కేవలం పెట్రోల్​, హైబ్రిడ్​ ఆప్షన్లు మాత్రమే. సీఎన్జీ మోడల్స్​ని పరిగణలోకి తీసుకోలేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More