భారత ఆటో మార్కెట్లోకి ఈ నెలలో రానున్న టాప్ 5 కార్లు..
జనవరి సందడి తర్వాత, ఫిబ్రవరి నెలలో కూడా భారత ఆటోమొబైల్ రంగం కొత్త లాంచ్‌లతో కళకళలాడనుంది. లగ్జరీ ఎస్‌యూవీల నుంచి ఎలక్ట్రిక్ కారు వరకు ఈ నెలలో రాబోతున్న పలు కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పవర్ఫుల్ జనవరి తర్వాత, భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఫిబ్రవరి 2026లో మరింత నిలకడగా, అదే సమయంలో ఉత్సాహభరితంగా ఉండబోతోంది. బీఎండబ్ల్యూ, ఎంజీ, నిస్సాన్ వంటి బ్రాండ్‌లు ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం ఎస్‌యూవీలు, గ్లోబల్ మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. మాస్-మార్కెట్ ఈవీల నుంచి లగ్జరీ కార్ల వరకు ఈ ఫిబ్రవరి 2026 దాదాపు ప్రతి కస్టమర్‌కు ఏదో ఒక కొత్తదనాన్ని అందించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో లాంచ్‌కు రెడీ అవుతున్న వెహికిల్స్ వివరాలను ఇక్కడ చూసేయండి.

ఫిబ్రవరి 2026లో లాంచ్ కానున్న కార్లు ఇవి..
- 2026 ఎంజీ మెజెస్టర్-
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన మెజెస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, 2026న దీనిని ఆవిష్కరచనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, విదేశాల్లో విక్రయించే ‘మాక్సస్ డీ90’ పోలికలతో కూడిన ఈ ఎస్యూవీ గంభీరమైన ఫ్రంట్ లుక్‌ను హైలైట్ చేస్తోంది.
డిజైన్: ఇందులో పెద్ద గ్రిల్, స్కిడ్ ప్లేట్‌లతో కూడిన రగ్గడ్ బంపర్, హుడ్ వెంబడి డీఆర్ల్స్తో కూడిన స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
ఫీచర్లు: శక్తివంతమైన బోనెట్, 20-ఇంచ్ అలాయ్ వీల్స్, వెడల్పైన ఫెండర్ ఫ్లేర్స్ దీనికి రోడ్డుపై బలమైన రూపాన్ని ఇస్తాయి.
2. నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ ఇండియా భారత మార్కెట్ కోసం తన కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా, ఫిబ్రవరి 4న టెక్టాన్ అనే కొత్త ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ ఇటీవల లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌కు సిబ్లింగ్ మోడల్, గట్టి పోటీదారు.
ఇంజిన్ ఆప్షన్లు: అధికారికంగా ధృవీకరించనప్పటికీ, ఇది 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. లోయర్ వేరియంట్లు నిస్సాన్ మాగ్నైట్‌లో ఉన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చు.
గేర్‌బాక్స్: మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ ఉండవచ్చు. భవిష్యత్తులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
3. బీఎండబ్ల్యూ ఎక్స్3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ ప్రో
బీఎండబ్ల్యూ తన కొత్త ఎక్స్3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్‌ను ఫిబ్రవరి 16న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. లాంచ్ అయిన తర్వాత, ఇది దేశంలోని ఎక్స్3 శ్రేణిలో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలవనుంది.
ఇంజిన్: ఇందులో 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
పర్ఫార్మెన్స్: ఈ సెటప్ 258 హెచ్‌పీ పవర్, 400 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
4. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్
వియత్నాంకు చెందిన ఆటోమేకర్ విన్‌ఫాస్ట్, గతంలోనే భారతదేశంలో తన 'లిమో గ్రీన్' ఎస్‌యూవీని ప్రదర్శించింది. కంపెనీ ఈ సెవెన్-సీటర్ మోడల్‌ను ఫిబ్రవరి 2026లో లాంచ్ చేయనున్నట్లు గతంలో ధృవీకరించింది.
డిజైన్: పేటెంట్ ఫైలింగ్‌లు, స్పై షాట్‌ల ప్రకారం, ఇది వీఎఫ్6, వీఎఫ్7 డిజైన్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో వాహనం వెడల్పు అంతటా విస్తరించి ఉన్న డీఆర్ఎల్స్ ఉంటాయి. ఇవి మధ్యలో కలిసి ఒక ప్రత్యేకమైన 'వీ' ఆకారాన్ని ఏర్పరుస్తాయి, ఇది బ్రాండ్ లోగోను హైలైట్ చేస్తుంది.
రూపం: నిలువుగా ఉండే హెడ్‌ల్యాంప్ యూనిట్లు దీనికి ఆధునిక రూపాన్ని ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఉన్న మజిల్ క్లాడింగ్ దీనికి పటిష్టమైన ఎస్యూవీ రూపాన్ని ఇస్తుంది.
5. వోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్-లైన్
వోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్-లైన్ ఫిబ్రవరి 2026లో లాంచ్ కానుంది. ఇది ప్రీమియం త్రీ-రో ఎస్యూవీ విభాగంలోకి వోక్స్‌వ్యాగన్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది. ఇది టైగూన్ ఆర్-లైన్ కంటే పై స్థాయిలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది.
డిజైన్: ఇది టైగూన్కి 7-సీటర్ వెర్షన్. ఇందులో షార్పర్ స్టైలింగ్, కనెక్టెడ్ ఎల్ఈడీ లైటింగ్, ఆధునిక డిజైన్ లాంగ్వేజ్ ఉన్నాయి.
పర్ఫార్మెన్స్: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసే ఇది 201.2 బీహెచ్పీ పవర్, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
వేగం: ఇది కేవలం 7.3 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు గరిష్టంగా 224 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


