Meesho IPO సబ్​స్క్రిప్షన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​- జీఎంపీ ఎంత? అప్లై చేయొచ్చా?

మీషో ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్! ఈ నేపథ్యంలో మీరు అప్లై చేయాలని యోచిస్తుంటే ఈ ఐపీఓ వివరాలు, సబ్​స్క్రిప్షన్​ స్టేటస్​, మీషో ఐపీఓ జీఎంపీ, నిపుణుల సూచనలను డీటైల్డ్​గా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 5, 2025, 12:16:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీషో లిమిటెడ్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) భారతీయ ప్రైమరీ మార్కెట్‌లో డిసెంబర్ 3, 2025న ప్రారంభమైంది. ఈ ఇష్యూ సబ్​స్క్రిప్షన్​నేటితో, అంటే డిసెంబర్ 5న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మీషో ఐపీఓ జీఎంపీతో పాటు అసలు దీనికి అప్లై చేయాలా? వద్దా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

మీషో ఐపీఓ డే 3- జీఎంపీ వివరాలు.. (Photo: Courtesy company website)
మీషో ఐపీఓ డే 3- జీఎంపీ వివరాలు.. (Photo: Courtesy company website)

మీషో ఐపీఓ వివరాలు..

మీషో ఐపీఓ ఫ్రెష్​ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలయికగా వచ్చింది.

ఫండ్స్​ టార్గెట్​: కంపెనీ మొత్తం రూ. 5,421.20 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రెష్​ ఇష్యూ: ఇందులో రూ. 4,250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు.

ఓఎఫ్‌ఎస్: మిగిలిన రూ. 1,171.20 కోట్లు ఓఎఫ్‌ఎస్ మార్గం కోసం రిజర్వ్ చేయడం జరిగింది.

మీషో ఐపీఓ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ అవుతుంది.

మీషో ఐపీఓ జీఎంపీ అప్‌డేట్..

మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, మీషో లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో మంచి ప్రీమియంతో లభిస్తున్నాయి!

నేటి జీఎంపీ: మీషో షేర్లు నేడు గ్రే మార్కెట్‌లో రూ. 53 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. ఇది నిన్నటి జీఎంపీ (రూ. 51) కంటే రూ. 2 ఎక్కువ!

గత మూడు రోజుల్లో, మీషో ఐపీఓ జీఎంపీ రూ. 42 నుంచి నేటి రూ. 53కి పెరిగింది.

మీషో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టేటస్​ బలంగా ఉండటం వల్లే జీఎంపీ పెరిగిందని స్టాక్​ మార్కెట్ నిపుణులు అంటున్నారు. మొదటి రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి, రూ. 5,421.20 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ 7.97 రెట్లు బుక్ అయింది.

మీషో ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు..

బిడ్డింగ్‌లో మూడొవ రోజు (డిసెంబర్ 5) ఉదయం 11:45 గంటల నాటికి, పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ వివరాలు:

మొత్తం ఇష్యూ- 13.54 రెట్లు సబ్​స్క్రైబ్​ అయ్యింది.

రిటైల్ పోర్షన్- 12.65 రెట్లు సబ్​స్క్రైబ్​ అయ్యింది

ఎన్‌ఐఐ సెగ్మెంట్- 20.67 రెట్లు ఓవర్​ సబ్​స్క్రైబ్​ అయ్యింది.

క్యూఐబీ పోర్షన్- 10.21 రెట్లు సబ్​స్క్రైబ్​ అయ్యింది.

మీషో ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​, ఇతర వివరాలు..

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 5, 2025.

ప్రైజ్​ బ్యాండ్: రూ. 105 నుంచి రూ. 111 (ప్రతి షేరుకు)

షేర్ల కేటాయింపు తేదీ: డిసెంబర్ 6, 2025 (శనివారం కావడంతో, ఆలస్యం జరిగితే డిసెంబర్ 8, 2025 అయ్యే అవకాశం ఉంది).

లాట్ సైజు: బుక్ బిల్డ్ ఇష్యూ ఒక లాట్‌లో 135 కంపెనీ షేర్లు ఉంటాయి. ఒక బిడ్డర్ లాట్ల రూపంలో ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మీషో ఐపీఓ రివ్యూ- అప్లై చేయాలా? వద్దా?

మీషో ఐపీఓకు మార్కెట్ నిపుణుల నుంచి సానుకూల స్పందన లభించింది.

ఆనంద్ రాఠీ ఈ ఇష్యూకు 'సబ్‌స్క్రైబ్' ట్యాగ్ ఇస్తూ.. "ఎఫ్‌వై25 ఆదాయాల ఆధారంగా, కంపెనీ 5.5 రెట్ల ఎంక్యాప్ టు సేల్స్ నిష్పత్తిని కోరుతోంది. పోస్ట్-ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5,00,958 మిలియన్లు ఉండటంతో, ఇష్యూ ధర అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది! ఎఫ్‌వై25లో రూ. 39,417 మిలియన్ల నష్టాన్ని ప్రకటించినప్పటికీ, కంపెనీ పెట్టుబడి దశలో ఉంది. అయితే అడ్జెస్టెడ్​ ఎబిట్​డా మెరుగుపడింది. ఫ్రీ క్యాష్​ ఫ్లో సానుకూలంగా మారింది. ఈ-కామర్స్ రంగం వృద్ధి చెందుతున్నందున, మీషో ప్రాఫిటబులిటీ అనేది ఖర్చుల ఆప్టిమైజేషన్, మార్కెటింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మేము ఈ ఇష్యూకు దీర్ఘకాలిక పెట్టుబడికి మాత్రమే సబ్‌స్క్రైబ్ రేటింగ్‌ను ఇస్తున్నాము," అని పేర్కొన్నారు.

నిర్మల్ బ్యాంగ్ బ్రోకరేజ్​ సంస్థ​ సైతం ఈ పబ్లిక్ ఇష్యూకు 'అప్లై' ట్యాగ్‌ను కేటాయించింది. "జీరో కమీషన్ వ్యాపార నమూనా ద్వారా మీషో టైర్ 2/3 నగరాల ఈ-కామర్స్ వ్యాపారంలో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది నాన్-మెట్రో నగరాల్లోని విక్రేతలు, వినియోగదారులు, కంటెంట్ సృష్టికర్తలు, లాజిస్టిక్స్ ప్లేయర్‌లకు ప్రయోజనం చేకూర్చే సరసమైన ఉత్పత్తుల వ్యవస్థకు దారితీసింది. కంపెనీ ఎఫ్‌వై25లో ఉచిత నగదు ప్రవాహాన్ని సానుకూలంగా మార్చినప్పటికీ, ఇంకా లాభాలను ప్రకటించలేదు. వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన లాభదాయకతను సాధిస్తుందని మేము నమ్ముతున్నాము. అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్‌లో, ఈ ఇష్యూ ఎఫ్‌వై25 ప్రైజ్​/సేల్స్​ రేషియోకి 5.7 వద్ద అందుబాటులో ఉంది, ఇది సహేతుకంగా కనిపిస్తుంది. కాబట్టి, ఇష్యూకు 'సబ్‌స్క్రైబ్' చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము," అని ఆ సంస్థ తెలిపింది.

ఐసీఐసీఐ డైరెక్ట్, మార్వాడీ షేర్స్ అండ్ ఫైనాన్స్, ఎస్బీఐ సెక్యూరిటీస్, మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్, మెహతా ఈక్విటీస్, స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్, వెంచూరా సెక్యూరిటీస్ కూడా మీషో ఐపీఓకు 'సబ్‌స్క్రైబ్' ట్యాగ్‌ను కేటాయించాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More