...
...
Next Story

ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇవి..

ఎంజీ హెక్టార్, హెక్టార్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్​ని ఎంజీ మోటార్​ ఇండియా ఇటీవలే లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో వీటి వేరియంట్లు, ధరలు, ఇంజిన్​ స్పెసిఫికేషన్లపై అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 17, 2025, 07:01:45 IST
Advertisement

భారత మార్కెట్లో 2026 ఎంజీ హెక్టార్, హెక్టార్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇటీవలే విడుదల చేసింది ఎంజీ మోటార్ ఇండియా. 2019లో ఈ ఎస్‌యూవీ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇది థర్డ్​ అప్డేట్​! ఈ తాజా మార్పులు ఈ ఎస్​యూవీని మార్కెట్‌లో పోటీకి అనుగుణంగా ఉంచడానికి ఉద్దేశించినవి. వెహికిల్​లో స్వల్ప మార్పులు మాత్రమే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​, ఎంజీ హెక్టార్​ ప్లస్​ ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు, వాటి ధరలు, స్పెసిఫికేషన్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హెక్టార్, హెక్టార్ ప్లస్‌ ఫేస్​లిఫ్ట్​- ఏ మార్పులు వచ్చాయి?

ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్ (Jitendra Takale)
ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్ (Jitendra Takale)

2026 హెక్టార్ ఫేస్‌లిఫ్ట్‌లో చేసిన మార్పులు కాస్మొటిక్​ అప్డేట్స్​కి మాత్రమే పరిమితమయ్యాయి.

గ్రిల్: రివైజ్డ్​ ఫ్రంట్ గ్రిల్‌ను ఎంజీ పరిచయం చేసింది.

అల్లాయ్ వీల్స్: కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

బంపర్‌లు: ముందు, వెనుక బంపర్‌లలో స్వల్ప మార్పులు చేశారు.

కలర్స్​: అదనంగా, ఈ ఎస్‌యూవీకి రెండు కొత్త ఎక్స్​టీరియర్​ కలర్స్​, అలాగే క్యాబిన్ లోపల కొత్త అప్‌హోల్‌స్టరీ ఆప్షన్స్​ లభిస్తాయి.

పరిమాణం: వాహనం మొత్తం ఆకృతి, కొలతల్లో మార్పు లేదు

2026 అప్‌డేట్‌లో ఇంజిన్లలో మార్పు లేదు..

యాంత్రికంగా, ఎంజీ ప్రస్తుతం ఉన్న పవర్‌ట్రెయిన్ శ్రేణిని కొనసాగించింది.

పెట్రోల్ ఇంజిన్: హెక్టార్, హెక్టార్ ప్లస్ రెండూ 1.5-లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజిన్ 141 హెచ్‌పీ పవర్​ని, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఆటోమేటిక్​తో లభిస్తుంది.

డీజిల్ ఇంజిన్: 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా అందిస్తున్నారు. ఇది 167 హెచ్‌పీ పవర్​ని, 350 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​, హెక్టార్​ ప్లస్​ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, ధర..

మూడు వరుసల హెక్టార్ ప్లస్ ఆరు లేదా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ కోరుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది.

ధరలు.. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఎంపికలను బట్టి మారుతూ ఉంటాయి. పెట్రోల్ సీవీటీ వేరియంట్ ధర మ్యాన్యువల్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, వాటి ధరలు..

వేరియంట్​

1.5లీటర్​ టర్బో పెట్రోల్​ ఎంటీ

1.5లీటర్​ టర్బో పెట్రోల్​ సీవీటీ

స్టైల్​రూ. 11,99,000
సెలక్ట్​ ప్రోరూ. 13,99,000
స్మార్ట్​ ప్రోరూ. 14,99,000రూ. 16,29,000
షార్ప్​ ప్రోరూ. 16,79,000రూ. 18,09,000
సావీ ప్రో 17,29,000రూ. 18,59,000
View All

ఎంజీ హెక్టార్​ ప్లస్​ ఫేస్​లిఫ్ట్​- వేరియంట్లు, వాటి ధరలు..

వేరియంట్​

1.5లీటర్​ టర్బో పెట్రోల్​ ఎంటీ

1.5లీటర్​ టర్బో పెట్రోల్​ సీవీటీ

షార్ప్​ ప్రోరూ. 18,99,000
సావీ ప్రోరూ. 19,49,000
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe