MG Majestor : ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ.. ఎంజీ మెజెస్టర్ బుక్ చేశారా? బడా ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్..
MG Majestor price : ఎంజీ మెజెస్టర్ అల్ట్రా లగ్జరీ, ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్. ఈ మోడల్‌కి సంబంధించిన ప్రొడక్షన్‌ని సంస్థ అధికారికంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ బడా ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎంజీ మెజెస్టర్ బడా ఎస్‌యూవీపై బిగ్ అప్డేట్! ఈ అల్ట్రా లగ్జరీ, ఆఫ్- రోడ్ కారును బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఈ మోడల్ ఉత్పత్తిని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. గుజరాత్‌లోని హాలోల్ తయారీ ప్లాంట్ నుంచి ఈ సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ రోల్ అవుట్ కానుంది. భారతదేశంలోనే మొట్టమొదటి 'డీ+ సెగ్మెంట్' ఎస్‌యూవీగా వస్తున్న ఈ కారు.. అత్యంత లగ్జరీ ఫీచర్లు, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల కలయికతో రూపొందింది.

ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఎంజీ గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేస్తూ.. అంతకంటే మెరుగైన ప్రీమియం లుక్‌తో ఈ మెజెస్టర్ రాబోతోంది. లీడింగ్ కాంపిటీటర్లకు చెక్ పెట్టేలా ఎంజీ మోటార్ ఈ కారును భారీ సైజులో డిజైన్ చేసింది.
ఈ అల్ట్రా-లగ్జరీ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇంజన్ సామర్థ్యం ఇక్కడ తెలుసుకోండి..
1. భారీ డైమెన్షన్స్, బోల్డ్ డిజైన్..
ఎంజీ మెజెస్టర్ తన సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన, వెడల్పైన, ఎత్తైన కారుగా నిలవనుంది!
దీని స్ట్రెయిట్, అప్‌రైట్ మస్కులర్ డిజైన్, రగ్గడ్ లుక్ దీనికి రోడ్డుపై ఒక ప్రత్యేకమైన గంభీరమైన రూపాన్ని ఇస్తాయి.
కఠినమైన అడవులు, కొండ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ట్రాఫిక్‌లోనూ ప్రయాణికులకు అత్యున్నతమైన కంఫర్ట్, లగ్జరీ ఫీలింగ్ ఇచ్చేలా దీని క్యాబిన్‌ను డిజైన్ చేశారు. ఇది 6, 7-సీటర్ లేఅవుట్ ఆప్షన్లలో లభించనుంది.
2. పవర్‌ఫుల్ ఇంజన్ అండ్ అడ్వాన్స్‌డ్ 4డబ్ల్యూడీ సిస్టమ్..
ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఈ మెజెస్టర్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన ఇంజన్, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను జోడించారు.
ఇంజన్: ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ అమర్చారు. ఇది గరిష్టంగా 215.5 పీఎస్ పవర్, 478.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఆఫ్-రోడ్ ఫీచర్లు: ఈ కారులో అడ్వాన్స్‌డ్ 4డబ్ల్యూడీ (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో పాటు ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఫ్రంట్, రియర్, సెంటర్ - ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ అందించారు.
డ్రైవింగ్ మోడ్స్: విభిన్న రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా 10 ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ మోడ్స్ (రాక్, శాండ్, మడ్, స్నో మొదలైనవి), కఠినమైన లోయల్లో కారును సులభంగా నియంత్రించే క్రాాల్ కంట్రోల్ మోడ్ కూడా ఉంది.
3. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ సేఫ్టీ..
రక్షణ పరంగా ఈ కారులో ఆధునిక లెవెల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్) టెక్నాలజీని అందించారు. ఇది డ్రైవర్‌కు ప్రమాదాల నుంచి ముందస్తు హెచ్చరికలను ఇస్తూ ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది.
వాటర్ వేడింగ్ కెపాసిటీ: ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ 219 ఎంఎం భారీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఏకంగా 810 ఎంఎం లోతైన నీటిలోనూ సులభంగా ప్రయాణించగలదు.
ఎంజీ మెజెస్టర్- ఓనర్‌షిప్ బెనిఫిట్స్..
కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు ఎంజీ సంస్థ ఈ లగ్జరీ కారుపై ప్రత్యేకమైన వారంటీ ప్యాకేజీని ఇస్తోంది. అవి..
- 5 సంవత్సరాల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ
- 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)
- 5 లేబర్-ఫ్రీ సర్వీసులు ఉచితంగా లభిస్తాయి.
ఎంజీ మెజెస్టర్- మార్కెట్లో పోటీ ఎవరితో?
ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల శ్రేణిలో ఉండే అవకాశం ఉన్న ఎంజీ మెజెస్టర్.. మార్కెట్లోకి వచ్చాక నేరుగా టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్తో పాటు త్వరలో రాబోయే ఫోక్స్ వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ మోడల్‌కి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కస్టమర్లు రూ. 41,000 చెల్లించి ఈ కారును ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


